పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/615

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. గీ.

యంతితో మణికాంచితో నమలహేమ
సారయజ్ఞోపవీతంబుతో రహించి
దీప్తమంజీరకావస్థఁ దిత్తిరీయ
నిగమనాదంబుతో వచ్చి నిలిచి నిలిచి[1].

121


తే. గీ.

అపుడు సనకాదులకుఁ బ్రత్యక్ష మగుచుఁ
దన్మహాయోగి మస్తకోదారభృంగ
సంగతపదాంబుజాతుఁడై చక్రహస్తుఁ
డభ్రగంభీరభాషల ననియె నంత.

122


వ.

మద్వారపాలురు మత్పూర్వసంకల్పవైభవమాయానాటకంబున
నధోలోకచక్రంబుఁ బ్రవేశించి యీశాపంబున నట్ల యవతరించి
తరించెదరు. మీరు వగ వొందకుండని యూరడించి తద్ద్వారపాలుర
నట్లనె నియోగించి సత్యసంకల్పవిభవుండై స్వస్థత నుండి యేత
దీశ్వరసంకల్పంబు సాధుల కెల్ల నెఱింగింప సనకాదులు బ్రహ్మాండస్థ
లోకంబులకుం జని రంత సత్యసంకల్పంబులచేత భగవత్పదంబున
నుండి వచ్చి కశ్యపుని యందు స్వాంశలేశంబులఁ బ్రవేశించి.

123


శా.

ఆదౌవారికులున్ యదృచ్ఛఁ జని సాయంవేళ భర్తం గనం
గాదిక్రీడల నుల్లసిల్లు దితియం దాత్యంతికస్వేచ్ఛమై
నాదిత్యుల్ వడఁకన్ హిరణ్యకహిరణ్యాక్షాఖ్యలఁ బుట్టి స్వ
ర్గాదుల్ తేజముఁ గాంచి యేలిరి ప్రతాపాహంక్రియాసంపదన్.

124


వ.

వారు బాహ్యంబున నుపనిషత్పదంబు తిరస్కరించినయట్ల వర్తించి
రందు.

125


క.

ఆజిష్ణుఁడు విష్ణుఁడు ఘో
రాజి హిరణ్యాక్షు నోర్చె యజ్ఞవరాహం
బై జనియించి సముద్భట
తేజంబున వాఁడు పొందె దివ్యపథంబున్.

126
  1. ఈపాదము తరువాత 'నేనిశముఖ్యులు ముందఱ బరాబరులు సేయ' అని కలదు. గ్రంథపాతము కానోపును.