పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/588

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


నాదికాలప్రకృతిసత్క్రియదయాదత్తాగ్నిపురుష! కర్మస్వాతంత్ర్య!
పాహి నమస్తుభ్యం హృషీకేశ నమస్తుభ్యం జగత్పతే! చిదచిద్వస్తు
రూపాయ చక్రిణే నమస్తుభ్య"మ్మని కాలప్రకృత్యాత్మాదృష్టశక్త్యాద్యధి
దేవతలు విన్నపంబు సేయ భగవంతుండు ప్రసన్నుండై యిట్లనియె:

32


సీ.

నిత్యదేవతలార! నిక్కం బెఱింగింపుఁ
                       డీబద్ధదేహుల కెందువలనఁ
దత్త్వవిప్లవ మయ్యెఁ దగనికాలంబున
                       వేదాంతములు గల్గి వెలసియున్న
బ్రథితశక్తిని జతుష్పాద్ధర్మశాలియౌ
                       కృతయుగంబున నసంగతము కాదె
[1]తత్త్వవిప్లవము దత్కలికాలమున కది
                       యుచితంబు కలివేళ నుండు ధర్మ


తే. గీ.

వృషభ మదిరుగ్ణపాదమై వివిధదోష
సిద్ధమైన రజస్తమోవృద్ధిబుద్ధి
[2]యల్పమై యున్కి కాలోచితాచరణము
గాదె కలికాలమునకు దుష్కలుషమునకు.

33


వ.

అది యెట్లయ్యె వెఱవక చెప్పుండని సర్వవిద్యాధిపతియగు శ్రీపతి
సనకాదులకు స్వజ్ఞానదార్ఢ్యంబు గలుగ నానతియిచ్చిన మాయాప్రకృతి
దేవత యీశ్వరకలిత మని తెలిసి, కృతనతియై యిట్లని విన్నవించె.

34


సీ.

అవధారు దేవ! నన్నాకాలశక్తి ని
                       యోగింప బహువిధోద్యోగలీలఁ
బరిణమింపుచునుండుఁ బరిణమింపుచునుండఁ
                       గల కాలశక్తి యేగతిఁ దలంచు
నది భవదాజ్ఞఁగా నౌదలఁ దాల్చి నే
                       నియవస్థఁ జరింతు నీవిధమున
నగు నవస్థయుఁ ద్వదీయత్వంబునకు మేర
                       యై నేఁడు మత్స్వభావానురూప

  1. తత్త్వవిప్లవమున దత్కలికాలమున కది
  2. యల్పమై యునికి కాలోచితాచరణము