పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/541

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మృతానందముం జెంది తత్సపర్యంతరాలంక్రియాపూర్ణహస్తాబ్జలై సేవ
గావింప నూహించి తచ్చేషతైకస్వభావానురూపాత్మవృత్తిన్ సదా వాసు
దేవాంతరంగానుకూలస్వరూపంబులన్ నిల్చి ప్రాసాదసౌధావరోధ
స్థలీవీథులందున్ విశేషంబునన్ రత్నవల్లీశలాకోపకౢప్తోరుసన్మార్జనీ
హస్తులై కొంద ఱచ్చోటు దారూడ్చుచుం దద్రజోరంజితాకారులై
కొంద ఱింపొందఁగా నుంద్రు తీడ్రించి శుంభన్మణీశాతకుంభస్ఫురద్గంధ
గంధోద్బటాంభోలవంబుల్ సమంతాద్విజ్జృంభంబుగాఁ జల్లుచున్
గొంద ఱుత్సాహముం బొంద ముక్తామణీచూర్ణముల్ తెచ్చి చూర్ణంబుగా
స్వస్తికాదుల్ ప్రశస్తంబుగాఁ బెట్టి తద్రంగవల్లీకలాపంబుఁ గావింపుచుం
గొంద ఱుర్దీప్తులై యుండ్రు మాణిక్యమాల్యాంకురార్ద్రాక్షరశ్రీలు తత్ప్ర
దేశంబులం జల్లుచుం గొంద ఱానందులై యుంద్రు రత్నప్రదీపంబులున్
బుష్పముల్ సత్ఫలంబుల్ సమగ్రంబుగాఁ జందనాంభస్సమాపూర్ణ
కళ్యాణకుంభంబు లేవంకలన్ నిల్పుచున్ గొంద ఱుప్పొంగ నానామణీ
రూపరంభాదిపుణ్యద్రుమంబుల్ బహిర్ద్వారసీమన్ నియోగింపుచుం
గొంద ఱానందముం జెంద శ్రీవత్సవక్షస్ఫురద్వైజయంతీకలాపం
బుతో నవ్యముక్తామణీధామకాలంకృతాఙ్జోరుకంఠంబుతోఁ జారు
శోణాధరాపాటలప్రస్ఫురద్దంతరోచిప్రభిన్నస్మితాపాంగవీక్షావిలా
సంబుతో మాంసలాంసాను[1]రూపాయితప్రస్ఫురత్కర్షపాళీవిభూషా
వరామృష్ట[2]గండస్థలశ్రీలతో నూత్నకర్పూరగంధాన్వితోచ్ఛ్వాస
[3]పూర్ణోత్తరోష్ఠోచితోత్తుంగనాసావిలాసంబుతో మందహాసంబుతో
సద్విశాలాయతాపాంగవీక్షామృతోల్లోలజాలంబుతోఁ దత్కళాపూర్ణ
సౌందర్యనిర్యన్మరందప్రసక్తద్విరేఫోపమానాలకశ్రీసమాజుష్ట
భవ్యాననచ్చాయతో నవ్యకుసుమధమ్మిల్లభారంబుతోఁ గాంతిపుంజీ
భవద్రత్నరాజత్కిరీటంబుతోఁ జిత్రవైడూర్యరాజన్మహాకుండల
శ్రేణితో నూర్థ్వపుండ్రంబుతోఁ గంఠభాగోల్లసత్కౌస్తుభస్ఫూర్తితో
దివ్యనానాయుధోదారబాహాచతుష్కంబుతో భవ్యయజ్ఞోపవీతోరు
హారాళితో హైమభూషాకదంబంబుతోఁ దప్తచామీకరాభాంశుక
స్ఫూర్తితో రమ్యపీతాంబరానద్ధసద్రత్నకాంచీవిశేషంబుతో మంజు
మంజీరపాదాబ్జతేజంబుతో నద్భుతాగారశృంగారపూరంబుతో సూరి
వర్యాగ్రశ్రీదృక్చకోరామృతద్యోతకాంతీప్రవాహంబుతో మించు
కల్యాణమూర్తిన్ విలోకించు పాలించు నవ్వాసుదేవున్ నిరీక్షించి
శ్రీమద్వికుంఠాధినాథుండు తా నిత్యముక్తాళితోఁ జాల మోదించు దద్వా
సుదేవైకలోకంబు చక్రాంకితుల్ చేరి సేవింతు రెల్లప్పుడున్.

123
  1. రూయత
  2. గంధస్థల
  3. పూర్ణోతరోష్టాచితోత్తుంగ