పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/538

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


భూతతద్వ్యోమోజ్జ్వలతల్లోకనివృత్పురవరాదిస్వాత్మారామాను
[1]మో(దను)లై యుండుట వేదాంతసిద్ధాంతోత్థితవైభవంబు వరవ్యోమ
లోకంబు నుతింప నెవ్వఁడు సమర్థుండు?

115


మ.

వరవిజ్ఞానరహస్యవాసనల భావ్యంబై మహద్దామవి
స్ఫురదానందదలోకమం దల ఘనౌజోరాశియై ఫుల్లనీ
రరుహాభంబగు నంతరాళమున సారంబైన వైకుంఠస
త్పుర మొప్పున్ నవకర్ణికాకృతిఁ దదాప్తు ల్చూచి వర్ణింపఁగన్.

116


తే. గీ.

అమితజనపదవరవైభవాన్వితంబు
నతివిపులమండలము నైన యప్పురంబు
కమలకర్ణికయును బోలి కానుపించెఁ
బురము లెన్నేని దళములై పొలుపు మెఱయ.

117


తే. గీ.

గురువరవ్యోమధామవైకుంఠలోక
మునకు నావరణము లేను ఘనత మెఱయ
నిత్యశుద్ధసుఖాత్ములై నివ్వటిల్ల
బ్రహ్మలోకంబు లెన్నేనిఁ బ్రబలు నందు.

118


వ.

అని వ్యాసభగవంతుఁ డానతిచ్చినఁ శుకుం డిట్లనియె.

119


క.

ఏయేయావరణంబుల
నేయేలోకంబు [2]లుండు నెఱిఁగింపుము నా
కాయుపనిషదుక్తుల విని
యాయజముఖ్యులు నిజాలయస్పృహ విడువన్.

120

పంచావరణాగణ్యనియతలోకములు

క.

అనిన విని యక్కుమారున
కనఘాత్ముండగు పరాశరాత్మజుఁడు సనా
తనపంచావరణాగ
ణ్యనియతలోకములఁ గొన్ని నయమునఁ బలికెన్.

121


సీ.

ప్రథమావరణమునఁ బ్రాచిమై వైకుంఠ
                       వైభవంబున మించు వాసుదేవ
లోకంబు రవిగణాలోకమై భృతసాధు
                       వారమై విమలనానారసాబ్ధి

  1. మోనై
  2. లొండు