పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/536

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


హారపర్వతములు నన్యవస్తువులు బ్ర
                       హ్మానందమయము లత్యద్భుతములు
స్వస్వోచితాశేషసద్గుణసామగ్రి
                       శాశ్వతంబై యుండు సంస్తుతింపఁ


తే. గీ.

బ్రాకృతాప్రాకృతార్థసౌభాగ్యమునకు
నంతరంగం బెంచికొన నెంతయైనఁ గలదు
తెలివి మెఱసిన సత్యావిదీప్సితార్థ
మాన మింతింత యనుట క్రమంబు గాదు.

109


ఆ. వె.

తత్పదస్థవిషయతతులెల్లఁ బ్రాకృతా
ర్థములయట్లు [1]మోహితములు గావు
పూతహృదయు లెంచ నేతత్స్వభావవి
ద్యోతకంబు లగుచునుండుఁ గాని.

110


సీ.

స్వాభావికాద్భుతాంచ దపారసౌందర్య
                       వరసుధాసింధుభావమునఁ దనరి
శ్రీశానుకూలైక్యశీలభోగంబులఁ
                       దత్పదద్రవ్యసంపద లొసఁగుట
చిత్రంబు గాదు విచిత్రము ల్వస్తుశ
                       క్తులు సర్వభావశక్తులు నచింత్య
సంతతజ్ఞానగోచరములు గొన్ని వ
                       స్తువులలోఁ గొన్ని వస్తువులు కొంద


తే. గీ.

ఱకు మనఃప్రియములు గొందఱకును విరతి
పుట్టఁగాఁ జేయు జడములై భువనములును
పరమపదలోకనిత్యాత్మభాగ్యమహిమ
యజహరాదులకైన శక్యంబె పొగడ.

111


వ.

"అత్రాయం పురుషః పరంజ్యోతి రూపం సంపద్య స్వేనరూపేణాభి
నిష్పద్యతే" "[2]అవహతపాప్మా విజరోప మృత్యుర్విశోకో విజిఘత్సో
విపిపాసస నత్యకామ నత్ [3]సంకల్ప" యనునవి యప్రాకృతలోకముం
బొందిన ముక్తజీవునికి నష్టగుణంబులు సంపన్నంబులై యుండును.
మఱియు ప్రకృతి శరీరతిరోధానపూర్వకం బగు నది జ్యోతిరన్వయము.

  1. మోహతములు
  2. యవహతపాప్మా
  3. సకల్ప