పుట:నారదీయపురాణము (అల్లాడు నృసింహకవి).pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


మది యధోముఖచక్రమై యంటి తిఱుఁగుఁ
బరగుఁ దదవస్థలీమధ్యభాగనాభి
మిళితమై త్రిగుణాత్మయై మెలఁగ నాయ
జాదులకునైన నెఱుఁగ శక్యంబె దాని."

(నార. 370-పుట. 214-వ)

ఇందులో కాలంలో త్రినాభివిభాగం గురించి నరసింహకవి స్పష్టంగా పేర్కొన్నాడు. శుక్ల, కృష్ణ పక్షాలు కలిస్తే ఒకమాసమని. రెండుమాసాలు ఒకఋతువని, ఆరుమాసాలు ఒక అయనమని యీ రూపంగా సంవత్సరాత్మకమైన కాలచక్రానికి రెండయనాలు, ఆరు ఋతువులు, పన్నెండుమాసాలు అని మాసంలో శుక్కృష్ణ భేదాలతో రెండు పక్షాలని ప్రాచీనకాలంనుంచి అందరూ భావిస్తున్నారు. నిజానికి రెండుమాసా లొకఋతు వైనట్లుగా, రెండు ఋతువులు ఒక నాభికాలమై కాలస్వరూపస్వభావాతను బట్టి ఆరు ఋతువులను రెండేసి ఋతువుల కొక నాభివంతున మూడు నాభులుగా - ఉష్ణనాభి, జలనాభి, శీతనాభులుగా - వేదర్షి గుర్తించి యీ క్రింది ఋగ్వేదమంత్రాల్లో ఒకటికి రెండుసార్లు ప్రకటించాడు.

ద్వాదశ ప్రథమః చక్రమేకం
త్రీణినభ్యానిక ఉతిచ్చికేత

(ఋగ్వే. 1 మం. 24 సూక్తం-48 ఋక్కు)

త్రినాభి చక్రమజరమనర్వం
యత్రేమా విశ్వాభువనాధి తస్థుః

(ఋగ్వే. 1 మం. 164 సూక్తం-2 ఋక్కు)

ఈ నాభికాలవిభజన గురించి మన ప్రాచీనఖగోళాదిశాస్త్రవేత్తలు యెక్కడా ప్రస్తావించకపోవడం చూస్తే మన వేదవిజ్ఞానం యెంత దుస్థితికి దిగజారిందో మనకు తేటతెల్లమౌతుంది. కాలంలో నాభిభాగం గురించి గతంలో (ఆంధ్రప్రభ-దినపత్రిక. 9-9-1962) ఒక వ్యాసంలో నేను వివరంగా చర్చించి ఉన్నాను. ఈత్రినాభికాలవిభజనను దృష్టిలో పెట్టుకొనే మన సామాన్యప్రజానీకంలో నాలుగుమాసాలు అంటే రెండు ఋతువులు ఒకనాభి అయినట్లు - నాలుగు మాసాలకాలం ఒక కాలవిభాగంగా - వేసాకాలం - వర్షాకాలం - శీతాకాలంగా చిరకాలంగా వ్యవహారంలో పాతుకొనివున్నది. ఈ త్రికాలనాభివ్యవస్థ ఇటు సామాన్యప్రజానీకవ్యవహారంలోనూ, అటు ఋగ్వేదంలోనూ సకృత్తుగా నారదీయపురాణంవంటి గ్రంథాలలోను నిలిచి వున్నదే గాని, యీ మధ్య అవతరించిన