పుట:దేశభాషలలో శాస్త్రపఠనము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇదియుఁగాక క్రొత్తగా నిర్మింపఁబడు గ్రంథములు వ్యర్థముగా మూలపడియుండునని గ్రంధకర్తలు తలఁపవలదు దొరతనము వారి వలనఁ బ్రోత్సాహము కలిగినయెడల విశేషమే అట్లు ప్రోత్సాహము కలుగక పోయినను బాఠశాలలలోఁ బఠనీయముగా నియమింపకపోయినను యోగ్యతగల గ్రంథమును— అది నవలగానిండు, చరిత్ర గ్రంథము కానిండు, కరినమైన శాస్త్రము కానిండు— ఆంధ్రలోకము తప్పక యాదరించుననియే నా తాత్పర్యము. ఇటీవల నాంధ్రదేశమునందు భాషాభిమానము కలిగినది పూర్వ మైదు సంవత్సరములలో నొక గ్రంథముయొక్క ౫౦౦ ప్రతు లమ్ముడుపోవుట దుర్లభముగా నుండెను. ఇప్పడొక్కొక్క గ్రంథము యొక్క ౨౦౦౦, ౩౦౦౦ల ప్రతులు విక్రయమగుటయేగాక రెండుకూర్పులు, మూఁడు కూర్పులు అచ్చగుట తటస్థించుచున్నది. ఏ పారశాలయందును బఠనీయ గ్రంథములుగా లేకపోయినను విజ్ఞానచంద్రికాగ్రంథమాలలో నిదివఱకుఁ బదునొకండు శాస్త్రీయ గ్రంథములు ప్రకటింపఁబడినవనియు, నందుఁ బెక్కులు రెండుసారులచ్చొత్తింపఁబడిన వనియు, నేగ్రంధమును ౩౦౦౦ ప్రతులకం పెను దక్కువ యమ్మడు పోలేదనియు, రసాయన శాస్త్రము వంటి కరిన శాస్త్రనునుగూడ నింగ్లీషు రాని స్వర్థకారులు కొందరు చదివి యుపయోగించు కొనుచున్నారనియు, నింగ్లీషు రానివారు పెక్కండ్రు గవర్నమెంటు టెక్నికల్ పరీకులకై యీగ్రంథముల నుపయోగించుకొను చున్నారనియు నందఱకు బాహాటముగాఁ దెలిసిన విషయమే కావున గ్రంథము లమ్ముడు పోవన్న భీతి గ్రంథకర్తలు మానవలయును. ఒకానొక పుస్తకము మంచిదగు నేని యది పరనీయగ్రంధము కాకపోయినను, “ఆ గ్రంథము నుపయోగింపవద్దు, మాకిష్టమైన యీగ్రంథము నే ఉపయోగింపుఁ'డని ఇకౌస్పెక్టర్లు చెప్పచున్నను నుపాధ్యాయులును, శిష్యులు నీ మంచిపుస్తక మునే తెప్పించి చదివెదరు ఇకాస్పెక్టరు వచ్చినప్పడు దాచిన దాచెదరేమో గాని యోగ్యమైన గ్రంథములఁ జదువుట మానరు

ఒక వేళఁ గొన్ని గ్రంథములకు లోకాశ్రయము లేకపోయినను, నాంధ్రదేశమందలి రాజులు, మహారాజులు మొదలయిన వారును, శ్రీమం తులును విద్యాసంఘములు నిట్టి గ్రంథకర్తలకు సాయముచేసి వివిధశాస్త్ర ములను గుఱించిన గ్రంథములను వ్రాయింపవలెను. భాష యందుఁ బ్రబంధములు, నాటకములు, నవలలు మొదలయిన లలితవాజ్మయ మభివృద్ధిఁ జెందుట యొక యొత్తు, శాస్త్రజ్ఞానాభివృద్ధి కనుకూలములైన గ్రంథములు నిర్మాణ మగుట యొకయెత్తు ఇట్టి గ్రంథములు దేళ దారిద్ర్యవినాశకములు