పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సత్యాగ్రహ చరిత్ర

53


మాసంలో నేటాల్ ఇండియన్ కాంగ్రెస్ స్థాపన జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్‌కు, నేటాల్ కాంగ్రెస్‌కు మధ్య ఒక తేడా వున్నది. నేటాల్ కాంగ్రెస్ సంవత్సరానికి 365 రోజులు పని చేస్తుంది. సంవత్సరానికి 3 పౌండ్లు రుసుము చెల్లించిన వారు యీ కాంగ్రెస్ మంబర్లు అవుతారు. దాతలు ఎక్కువ సొమ్ము యిచ్చినా స్వీకరించి వారి పేర విరాళంగా జమ చేస్తారు ఎక్కువ సొమ్ము చెల్లించమని అందరినీ కోరడం జరిగింది. ఆరు లేక ఏడు మంది మెంబర్లు సంవత్సరానికి 24 పౌండ్లు కూడా యివ్వడం ప్రారంభించారు 12 పౌండ్లు యిచ్చే వారి సంఖ్య ఎక్కువగా వున్నది. ఒక నెల రోజుల్లో నేటాల్ కాంగ్రెస్‌లో 300 మంది మెంబర్లు చేరారు. వారిలో హిందువులు, మహమ్మదీయులు క్రైస్తవులు. పారసీకులు మొదలగు అన్ని మతాలవాళ్లు వున్నారు. నేటాలునందు నివసించే వివిధ ప్రాంతాల వారు కూడా వున్నారు మొదటి సంవత్సరం పని బ్రహ్మాండంగా జరిగింది. పెద్ద పెద్ద వ్యాపారస్తులు, తమ తమ వాహనాల్లో కూర్చొని. దూరదూర గ్రామాలకు క్రొత్త మెంబర్లను చేర్చుటకు చందాలు వసూలు చేయుటకు వెళ్లేవారు అడగంగానే జనం చందాలు వెంటనే యిచ్చేవారు కాదు. వారికి వివరమంతా చెప్పవలసి వచ్చేది. ప్రజలకు చెప్పాలంటే చెప్పేవారికి రాజకీయ పరిజ్ఞానం అవసరం కదా అందువల్ల జనం విషయాన్ని అర్ధం చేసుకునేవారు యిదిగాక నెలకొకసారి నేటాల్ కాంగ్రెస్ సమావేశం జరుగుతూ వుండేది ఆ సమావేశంలో జమాఖర్చుల వివరాలు ప్రతిపైసకు లెక్కలు తెలియజేయడం, మెంబర్లంతా అంగీకరించడం, ఆ నెలరోజుల్లో జరిగిన ఘట్టాలు వివరించడం, ఆ వివరమంతా మినిట్స్ బుక్కులో వ్రాయడం జరుగుతూ వుండేది మెంబర్లు రకరకాల ప్రశ్నలు అడగతూ వుండేవారు. క్రొత్త కార్యక్రమాల్ని గురించి చర్చలు జరుగుతూ వుండేవి దీనివల్ల ఎన్నో లాభాలు కలిగాయి. ఎప్పుడూ మాట్లాడి ఎరుగనివారు మాట్లాడటం నేర్చుకున్నారు. ఉపన్యాసాలు కూడా జాగ్రత్తగా యివ్వసాగారు యిదంతా అక్కడి భారతీయులకు క్రొత్తగా వున్నా. కొద్ది కాలంలోనే అందుకు వారంతా అలవాటు పడిపోయారు. యింతలో లార్డ్‌రిప్పన్ నేటాలు బిల్లును నిరాకరించాడని వార్త వచ్చింది. దానితో