పుట:దక్షిణాఫ్రికా సత్యాగ్రహ చరిత్ర.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

300

గోఖలే యాత్ర - 2


గురించి ఆరోజు ఉదయం గోఖలే గారికి చెప్పటమో లేక ముందు రోజు రాత్రి వారి అనుమతి కోసం తెలియజేయటమో జరిగేది. మంత్రివర్గంతో కలిసేపని చాలా బాధ్యతతో కూడుకున్నది. గోఖలే గారితో అక్కడికి కలిసి వెళ్ళటం కానీ కనీసం వెళ్లే ప్రస్తావన కూడా చేయకూడదని మేము ముందే నిర్ణయించుకున్నాము. నేను కూడా వుండటం వల్ల మంత్రి మండలికి గోఖలేగారికి మధ్య సంభాషణల్లో కొంతైనా మొహమాటం వుండవచ్చును అది స్థానిక హిందువుల మరియు నాయొక్క తప్పిదమేనని భావించేవారు తమ ఆలోచనలను మనస్సు విప్పి చెప్పలేక పోవచ్చును. కానీ దీనివల్ల గోఖలేగారి బాధ్యత ద్విగుణీకృతమవుతుంది. ఒక వేళ గోఖలేగారి వల్ల సత్య సంబంధమైన ఏదేని తప్పు దొర్లితే, లేదా మంత్రి మండలి వారు గోఖలే గారి సమక్షంలో ఏదేని కొత్తవిషయాలను వెల్లడిచేస్తే గోఖలేగారి వద్ద దానికి తగిన సమాధానం లేకపోవచ్చు లేదా భారతీయుల పక్షాన ఏదేని విషయమై స్వీకృతి ప్రకటించే అవసరం వస్తే అప్పుడు నేనో లేదా దక్షిణాఫ్రికాకు చెందిన ఎవరో ఒక బాధ్యతాయుతమైన భారతనేత లేకపోవటం మంచిదేనా అని సమస్య వచ్చింది. ఈ సమస్యకు గోఖలే వెంటనే పరిష్కారం చెప్పారు. మొదటి నుంచీ చివరిదాకా భారతీయుల స్థితి గతులను గురించిన సంక్షిప్త వివరణం వ్రాసి యివ్వమన్నారాయన వారు ఎంత వరకూ వెళ్ళేందుకు సిద్ధంగా వున్నారో కూడా దానిలో నేనే వ్రాయాలి. దానికి సంబంధంలేని విషయమేదైనా సమావేశంలో తలెత్తితే అది తనకు తెలియదని వారే ఒప్పుకుంటారు. ఈ నిర్ణయం వారే చేశారు కనుక వారు నిశ్చింతగా వున్నారు ఇప్పుడిక దీని సారాంశం తయారు . చేస్తే వారు దానిని చదువుకోవటమే మిగిలివుంది. కానీ చదువుకునేందుకు నేను వారికి సమయమే యివ్వలేదు నేను ఎంత చిన్నగా వ్రాద్దామన్నా నాలుగు ప్రాంతాలలోని భారతీయుల పద్దెనిమిది సంవత్సరాల ఇతిహాపాన్ని పది, యిరవై పేజీల దాకానైనా వ్రాయకుండా ఎలా వుండగలను? అంతేకాక - దీన్ని చదవగానే వారి మనస్సులో సందేహాలు రావటం సహజం. కానీ గోఖలేగారి జ్ఞాపకశక్తి ఎంత తీక్షణమైనదో పరిశ్రమించే శక్తి కూడా అంతే తీవ్రమైనది. రాత్రంతా వారూ