పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

372 తెలుగు భాషా చరిత్ర

1. బహువచన ప్రత్యయ యుక్తనామాల చివరి 'ఉ' 'అ' గా మారుతుంది. ఉదా. పుస్తకాలను, పుస్తకాలకు, పుస్తకాలకోసం, పుస్తకాల పురుగు. కాని పెసలు విశేషణంగా ప్రయోగించినప్పుడు రేఫాదేశం అవుతుంది. పెసరచేను. బహువచన ప్రత్యయ విభాగం స్పష్టంగా చెయ్యటానికి వీల్లేని శబ్దాల్లోకూడా చివరి 'లు' లోని 'ఉ' 'అ'గా మారుతుంది. ఉదా : పాలడబ్బా, నీళ్ళపాలు.

2. బహువచనంలో అంతిమ మకారలోపం జరిగి, స్వరదీర్ఘత ఏర్పడ్డ రూపాలు కు,ను విభక్తులముందుకూడా ప్రయుక్తమవుతాయి. అయితే 'ని' ఆగమంగాచేరుతుంది. ఉదా : పొలం + కి > పొలానికి, దేశం + ని > దేశాన్ని, ఈ కార్యం ఇతర విభక్తులముందు, శబ్దాలముందు జరగదు. ఉదా. మంచంమీద, పొలంలో. కొందరి వ్యవహారంలోని ఆగమంలేదు.

3. కొన్ని మకారాంతశబ్దాలు ఇతర నామాలముందు ప్రయుక్తమైనప్పుడు 'మ' కారానికి 'పు' ఆదేశం అవుతుంది. ఆధునికభాషలో ఇది నిత్యంకాదు. ఉదా. బియ్యం ; బియ్యంగింజ, బియ్యపుగింజ: మంచం : మంచంకోడు, మంచపుకోడు, బెల్లం : బెల్లంపానకం, బెల్లపుపానకం.

4. 'ఇల్లు' మొదలై న శబ్దాలకు మొదటి అచ్చు తరవాత భాగానికి '౦టి' ఆదేశమవుతుంది. ఉదా. ఇల్లు: ఇంటికి, ఇంటిపైన, పల్లు : పంటినొప్పి, కన్ను: కంటిరెప్ప.

5. కొన్ని 'ర,రు, లు, డు' అంతంలో ఉన్న శబ్దాలకు చివరి అక్షరానికి 'టి' ఆదేశమవుతుంది. ఉదా. గోరు: గోటితో, నోరు: నోటినిండా, ఏరు : ఏటిఒడ్డు, రోలు : రోటిలో, పాడు : పాడుమట్టి, గూడు : గూటిలో, నెత్తురు : నెత్తుటి మడుగు, నుదురు , నుదుటిరాత, పగలు : పగటిపూట, మొదలు : మొదటిరోజు, పెరడు. : పెరటిచెట్టు, తాబేలు : తాబేటికాయ, కుందేలు : కుందేటికొమ్ము, పడమర : పడమటిల్లు.

6. చివరి వ్యంజనం దంతమూలీయ మూర్జన్య వర్ణాలో ఒకటైనా ఇదంత చతుర్మాత్రాక శబ్దాల్లో చివరి అక్షరానికి 'టి' ఆదేశమవుతుంది. ఉదా. పందిరి : పందిట్లో, వాకిలి : వాకిటికి, నాగలి : నాగటికర్రు. రోకలి : రోకటిపోటు, చావిడి: చావిట్లో, పిడికిలి : పిడికిట్లో.