పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/360

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగులిపి పరిణామం

345

ఆంధ్రదేశంలో అశోకుడు వేయించిన శాసనాలు గుంటూరుజిల్లా భట్టిప్రోలులో ఒక స్తూపంలో స్తూపస్థాపకుల పేర్లున్న మూడు కరండకాలు-రాతిబరిణలు దొరికాయి. ఈ కరండకాల మీదిలిపికి అశోకలిపికి పోలికలు చాలాఉన్న ఘ, చ,ద, ధ,మ, ల, శ, ష అక్షరాలు భిన్నంగా కనిపించడంవల్ల దీనిని ద్రావిడ బ్రాహ్మి అని, ఇది క్రీస్తుకు మూడు శతాబ్దాలకు పూర్వమే విడిపోయి ఉంటుందని బ్యూలర్‌ (EI 3. 825) అభిప్రాయపడ్డారు.

12.4. దక్షిణ బ్రాహ్మినుంచే తేలుగులిపి ఆవిర్భవించింది. మనదేశాన్ని పెక్కురాజవంశాలవారు పాలించారు. వీరు తమ శాసనాలను తమ మాతృభాష లోను, ప్రాంతీయభాషలలోను వేయించారు. ఆయా శాసనాలలిపులు ఆయారాజుల పేరుతో సాతవాహనలిపి లేక ఆంధ్రలిపి, ఇక్ష్వాకులిపి, పల్లవలిపి, వేంగీలిపి, చాళుక్యలిపి, కాకతీయలిపి అని ప్రచారం పొందాయి. (తెలుగుభాషాసమితి : తెలుగు సంస్కృతి 3. 1057-58) దీనికి కారణం ఆయారాజుల కాలంలో జరిగిన మార్పులు, ఈ మార్పులలో అందమైన ఘట్టం ఇక్ష్వాకులకాలం. ఈ ఇక్ష్వాకుల కాలం తెలుగునాడులో యాభై సంవత్సలరాకన్నా హెచ్చుకాలం నిలవలేదు. తర్వాత శాలంకాయనులు వేంగీనగరం రాజధానిగా కొంత తెలుగు ప్రాంతాన్ని ఏలారు. వీరికి వైంగేయులు అనిపేరు వచ్చింది. వీరికాలంలో బ్రాహ్మీలిపిలో మరికొన్ని మార్పులు వచ్చాయి. కాలంకాయనుల తర్వాత విష్ణుకుండినులు తెలుగుదేశం పాలించారు. ఇది లిపి పరిణామంలో మరొక ఘట్టం. ఈ కాలపులిపిని వేంగీలిపి అన్నారు. ఇది తెలుగు కన్నడ దేశాలలోనేకాక దక్షిణాపథమంతటా వ్యాప్తి చెందింది. ఇది తెలుగు కన్నడలిపికి పూర్వరూపం. ఇదే ఇండో చైనా, మలేషియా, జావా, ఇండోనీషియాలలోని హిందూవలస రాజ్యాలలోను మొట్టమొదట వాడబడింది.

12.5. విష్ణుకుండినుల కాలంలో లిపిలో చెప్పుకోదగిన మార్చువచ్చింది. శాలంకాయనుల కాలంలో కొన్ని అక్షరాలపై కనిపించిన చిన్న అడ్డుగీత విష్ణుకుండినుల కాలంలో దాదాపు అన్ని అక్షరాలపైనా కనిపించింది. అప్పటి తెలుగు భాషలో ఉండి, తర్వాత మరుగయిపోయి, నేడు తమిళభాషలో మిగిలిన 'ఱ' అనే వింత ఆక్షరం విష్ణు కుండినుల కాలంలో కనిపించడం మరొక విశేషం. ఈ వింత అక్షరం నన్నయకాలందాకా వాడుకలో ఉంది (అహదనకర శాసనం, భారతి 14. 825:47). దీని ఉచ్చరణ తెలుగులో క్రమంగా డ, ర లుగా మారింది. వర్ణమాల