పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/349

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

334

తెలుగు భాషా చరిత్ర

11. 7. రెండుభాషలమధ్య సంబంధం ఎక్కువగా ఉన్నప్పుడు స్వతంత్ర పదాలే కాకుండా అనుబంధరూపాలుకూడా ఎరువుగారావచ్చు. ఎరువుమాటలలో కనిపించే కొన్ని అనుబంధరూపాలు దేశ్య రూపాలకుకూడా చేర్చడం జరుగవచ్చు. ఉదాహరణకు "పౌజుదారు” మొదలైన ఆదానపదాల్లో కనిపించే 'దారు' అనే అనుబంధరూపం కొన్ని కొన్ని తెలుగు పదాలపైనకూడా కనిపిస్తుంది. ఉదా : కొనుగోలుదారు, అమ్మకందారు, మొ. అలాగే కరారునామా, కౌలునామా మొదలైన చోట్ల కనిపించే 'పత్రం' అనే అర్థం ఇచ్చే 'నామా' రూపం ఇంగ్లీషునుంచి ఎరువుతెచ్చుకున్న వీలు (will) తో చేరి 'వీలునామా' అనే రూపం తెలుగులో ఏర్పడింది. ఈ విధంగా ధాతువును ఒక భాషనుంచి, అనుబంధరూపాన్ని మరొక భాషనుంచి ఎరువు తెచ్చుకొని పదాన్ని సృష్టించడాన్ని (loanblend) అని అంటారు. ఇటువంటివి నామవాచకాల్లోనేకాక క్రియలలో కూడా కనపడతాయి. ఉర్దూ ప్రేరణార్థక రూపాలపైన తెలుగుప్రత్యయాలు చేరటంవల్ల క్రొత్తక్రియారూపాలేర్పడుతాయి. ఉదా : బనాయించు, చలాయించు, దవుడాయించు మొదలైనవి.

11.8. లోకనిరుక్తి (Folk-etymology: అన్యదేశ్యాల ప్రభావంవల్ల నిసర్గపదాలలో మార్పురావచ్చు. విశ్వాసఘాతకుడు అనే అర్థం ఇచ్చే 'నమ్మక్‌ హరామ్‌' (మెకంజీవ్రాతప్రతి 133, పు. 101) అనే పదంలో 'హరామ్‌' అనేది అన్యదేశ్యం, నమ్మకం అనేది తెలుగుపదం. ఉర్దూలో నమ్మక్‌హరామ్‌ ఈ అర్థంలో కనిపిస్తుంది నమక్‌ అంటే ఉర్దూలో ఉప్పు అని అర్థం. కాని తెలుగులో నమక్‌ అనే పదం లేదు. కాబట్టి ఎక్కువగా వాడకంలో ఉన్న నమ్మకం అనే పదం 'నమక్‌' అనే పదం సమాసంలో వాడబడింది. ఈ విధంగా ఎరువు తెచ్చుకున్న పదాన్ని నిసర్గమైన పదంలాగా మార్చటమే లోకనిరుక్తి.

11. 9. ఉర్దూలోని -గార్‌ అనే ప్రత్యయం agentive suffix లాగా వాడబడుతుంది. ఉదా : మదద్‌ 'సహాయం, 'మదద్‌గార్‌' 'సహాయకుడు'. తెలుగులో అదే వర్ణరూపం (phonemic shape) కలిగిన్న-'గారు' గౌరవర్థసూచక ప్రత్యయంగా వాడబడుతుంది. ఉదా: మాస్టర్‌ గారు, అయ్యగారు మొ. వి. అన్యదేశ్యమయిన 'మదద్‌గారు' ఎరువుతెచ్చుకోవడంతో తెలుగు ప్రత్యయం అయిన 'గారు' అర్థంలో మార్పు వచ్చింది. అంటే ఈ ప్రత్యయం వాడబడే పరిసరాలు ( environments ) ఎక్కువయ్యాయి. ఈ విధంగా ఎరువుతెచ్చుకున్న భావాన్ని