పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆధునికయుగం : గ్రా౦థికవ్యావహారికవాదాలు 269

శతాబ్దానికి ముందుగానే ముద్రణ సౌలభ్యం, సామాన్యులకు కూడా విద్యాసౌకర్యాలు అధునాతన విద్యాబోధనపద్ధతులు తెలుగువారికి సమకూడేయి. ఇన్ని కారణాల వల్ల కొందరు విద్వాంసుల్లో వచ్చిన భావపరిణామమో విప్లవమో ఈ వాదోపవాదాలకు ప్రధానహేతువై ఆంధ్రసాహితీస్వరూపంలో భాషాచరిత్రలో పరమాద్బుతమైన విజయాలు సాధించింది. వాటికి బీజాలు భాషాసాపాత్యచరిత్రలో శతాబ్దాలకు ముందే పడి ఉన్నందువల్ల జరిగిన మార్పులన్నీ క్రమపరిణామంలో వచ్చినవేనని చెప్పవచ్చు. అయితే ఈ పరిణామాలు త్వరత్వరగా రావటానికి మాత్రం ఆంగ్ల భాషా సాహిత్యాదుల పరిచయం చాలా తోడ్పడింది. స్థూలంగా చరిత్రగతమైన ఆ మార్పులను ఇక్కడ పరిశీలిద్దాం.

9. 2. సనాతనలాక్షణికు లెన్ని కఠోరనియమాలు పెట్టినా, కవిపండితులెంతగట్టిగా ప్రయత్నించి ఆ నియమాల ననుసరించినా, కావ్యభాషలో అన్యదేశ్య పదాలూ, మాండలికాలూ వ్యాకరణవిరుద్ధప్రయోగాలు చాలా ప్రాచీనకాలంనుంచే అక్కడక్కడ ప్రవేశించటం మొదలుపెట్టేయి. మొదట అన్యదేశ్యాలను పరిశీలిద్దాం. క్రీ శ. పద్నాలుగో శతాబ్దంనుంచి అన్య దేశ్యశబ్దాలు కావ్యభాషలో ప్రవేశిస్తూ వచ్చాయి. ( గోపాలకృష్ణారావు, 1968, పే. 12). మచ్చుకు, తిక్కన ప్రయోగించిన 'త్రాసు' శబ్దం 'తరాజు' నుంచి ఏర్పడ్డది (అదే పే. 18). ఖుసి, సురధాణ (హర. 1-22), మురాయించు (హర. 3-89), దివాణము (హర. 4.9), సామాను (హర. 1-27) మొదలై న పదాలను శ్రీనాథుడు ప్రయోగించాడు. అప్పకవిలాంటి సనాతన లాక్షణికుడు 'వ్యవహారహాని' కలుగుతుందన్న కారణంతో అన్యదేశ్య ప్రయోగాన్ని ఆమోదించి ఉదాహరించాడేగాని (అప్ప. 1-64 నుంచి 70) సంస్కృత ప్రాకృతసమాలకులాగా వీటినికూడా రూపనిష్పాదనక్రియను ఏర్పరచనూ లేదు; ఆర్వాచీనులు అదేవిధంగా ప్రయోగించవచ్చునని అనుమోదించనూ లేదు. తరువాతి లాక్షణికులు సరేసరి. ఈ విధానం కాలక్రమాన పండితమండలికి అధికామోదకరమై క్రీ. శ. పందొమ్మిదో శతాబ్దినాటి శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి చాటువులనంటే వాటిలో వెర్రితలలు వేసింది. ఉదాహరణకు, 'వీరు తెలుంగు సాము లరబీ తరబీయతు నొప్పు గొప్ప సర్కారు వలే జమీలు దరఖాస్తుగ నేలిన రాజమాన్య హంవీరుల' ..వగైరా (పిచ్చయ్యశాస్త్రి, 1961, పే. 65). అలాగే ఆ శతాబ్ది తుది రోజుల్లో అచ్చైన 'కన్యాశుల్కం' లో (1896) గురజాడ అప్పారావుగారు ఆంగ్లభాషాపదాలను విశృంఖలంగా వాడేరు.