పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కావ్య భాషా పరిణామం 235

అన్నంత క్రియలమీద సహాయకక్రియలు చేరి భిన్నార్ధాల్లో సంయక్త క్రియ లేర్పడుతున్నాయి. ఆత్మార్థక, కర్మణ్యర్థక క్రియలు ఇలాంటివి. నన్నయ సంస్కృత భారతం అనువదించేటప్పుడు - పడు కర్మణ్యర్థకాలను విశేషంగా వాడాడు. నన్నిచోడునిలో రెండు ప్రయోగాలు మాత్రమే కలవు. (కు.సం. 9-67, 10-47). ఇతర కవుల్లోను విరళంగానే వాడబడింది. పడు కర్మణ్యర్థకరూపం సంస్కృత భాషా ప్రభావంవల్ల తెలుగున కలిగిందని చెప్పవచ్చు.

ప్రాచీన గ్రంథాల్లో - కొను సహాయకక్రియ లేకుండానే కొన్ని క్రియలు ఆత్మార్థంలో వాడబడ్డాయి. బబ్రుభార్య దనకు భార్యచేసె (భార. 2.2.6); పరమేశ్వరుఁ బ్రత్యక్షంబుసేసి (కు.సం. 1-7); పరిధానంబులు సవరించుచు (10-4).

పదకల్పాలు

7.34. (1) ఏవార్థకం : 11-12 శతాబ్దాల్లో ఏవార్థక ప్రత్యయం 'అ'. నన్నయలో ఇదే ఉన్నది. నన్నిచోడునిలో 'అ' తోపాటు కొన్ని ప్రయోగాల్లో ఏ ప్రత్యయంకూడ కనబడుతోంది. ఉదా: చేనంబండిన విత్తు చేనికె వెదవెట్టునట్లు (కు.సం. 1-49), సమకాలపు శాననాల్లోను అ/ఏ లు పక్క పక్కన వాడబడి ఉండటాన్ని బట్టి ఈ రెండూ ఆనాడు వ్యవహారంలో ఉన్నాయని తెలుస్తూంది. క్రమంగా ఏ కారానికి వ్యాప్తిహెచ్చి అకారం లోపించింది. ఏ వార్థకం నామాలశోనేగాక క్రియాపదాలతోనూ వాడబడింది. ఉదా: నీదానగాన (భార. 1-6-2, 250). తర్వాతికాలంలో ఈ ప్రత్యయం ఇలా క్రియాపదాలతో వాడే అలవాటు పోయింది.

(2) సముచ్చయార్థకం : ఉన్‌ ప్రత్యయము, ను, ని రూపాంతరాలు. ఉదా. తనకిష్టుడున్‌ (భార. అది.) ఒకప్పడీ ప్రత్యయంపై మరల ప్రత్యయం చేరవచ్చు. ఏమినిఁ జేయగలేక (భార. ఉద్యో. 2-108). సముచ్చయనకారం లోపించి పూర్వస్వరానికి దీర్ఘం రావడం శాసనాల్లో 11 వ శతాబ్దంనుంచి, కావ్య భాషలో 18 వ శతాబ్దంనుంచి కన్పిస్తోంది. తిక్కన ప్రయోగం : నమ్మీనమ్మని (భార. శా౦తి. 2-351) ; శ్రీనాథుడు చాటువుల్లో ; చల్లా యంబలి ద్రావితిన్‌.

వ్యవహారంలో (1) ద్విత్వయుక్తాలు న్ను / న్ని ప్రత్యయాలు. ఉదా. ప్రతి సంవత్సరమున్నూ (SII VI. 1198, విశాఖజిల్లా. క్రీ. శ 1242);