పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 197

క్రియలు చేరగా ఏర్పడేవి రెండవరకం సమస్త క్రియలు. ఉదా. చేస్తు-వుండగా (SII 10.772 4,1698). కా-వలెను (NI 3 రాపూరు 18.42-18, 1662).

6.32. సకర్మక క్రియలు: చూచ్‌ (SII 6.79.13, 1796), తీన్‌ (NI 2 కందుకూరు 48.30,1650) మొదలైనవి. (1) సిద్ధ సకర్మకాలు, (2) అకర్మకాలకు -చు, -ఇంచు, -వులు చేరి ఏర్పడేవి సాధ్య సకర్మకాలు. ఉదా. ఉంచు (అ.క్రి.ఉండు) (SII 7.845.4 1632), ఈడేర్చు (అ. క్రి. ఈడేరు) (NI 2 కావలి 44.8, 1715), జరుపు (అ.క్రి. జరుగు) (SII 6.663.13, 1482), పండించ్‌ (అ. క్రి. పండు) (NI 2 కందుకూరు 48.18,1650),

6.33. ప్రేరణార్థకాలు : సకర్మకాలకు -ఇంచ్‌ చేరటంవల్ల ప్రేరణార్థకాలేర్పడతాయి. ప్రేరణ -ఇంచ్‌కు ముందు క్రియా ప్రాతిపదికలతో కింది మార్పులు వస్తాయి. (i) (చ్)చ్ (వ్‌)వ్‌ గా మారుతుంది. ఉదా. కొలుచ్‌ :- కొలిపించ్‌ (SII 10.758.17,1658), (ii) -న్‌ -య్‌ గా మారుతుంది. ఉదా. వ్రాన్‌ : వ్రాయుంచ్‌ (SII 7.790.8, 1714), (iii) త్ర్యక్షర క్రియా ప్రాతిపదికలలోని రెండవ అక్షరంలోని ఉ ఇ గా మారుతుంది. నడుపు : నడిపించ్‌ (SII 10.759.81,1663).

6.34. క్రియా ప్రాతిపదికలలో మార్పులు: కాలవాచి ప్రత్యయాలకు ముందు క్రియా ప్రాతిపదికలలో కింది మార్పులు కనిపిస్తున్నాయి. (1) అకారాది ప్రత్యయాలకు ముందు ప్రాతిపదిక చివరి -స -యగా మారుతుంది. ఉదా. చేయ.-వలదు <(చేన్‌-అ-వలదు ) (SII 5.1203.86,1778). ఇంతకు ముందు ఈ సూత్రం భిన్నంగా ఉండేది. తాలవ్యాచ్చులకు ముందు -య -స కావటమే ఆ సూత్రం (§ 8.48 (1); 4 51 (గ)). ఉదా. చేయ ;- చేసి చేసెను మొదలైనవి. తరువాత సకారాంత సపదాంశాలు ఇతర పరిసరాల్లోకి కూడా వ్యాపించాయి. ఉదా. త కు ముందు : చేస్తూ (ప్రా. చేయ -చ)ు, ఆత్మార్థక సహాయక క్రియ -కొ ను ముందు : చేసు-కొను (ప్రా. చేసికొని), చేసు-కోండు (ప్రా. చేయు-వాండు) మొదలైనవి. ఇవి యకారాంత ధాతువులు సకారాంతాలుగా పునర్నిర్మితాలయ్యా యనటానికి నిదర్శనం. చేసు-వాండు వంటి రూపాలు 12వ శతాబ్ది నాటికే కనిపిస్తున్నాయి. (కందప్పచెట్టి § 3.10, § 5.46). ఈ పునర్నిర్మాణం ఆప్పటికే ప్రారంభమై ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. (2) -చ్‌, -చ్చ్‌, -౦చ్‌ లు తకారంతో మొదలయ్యే ప్రత్యయాలకు ముందు స గా మారుతాయి.