పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

164 తెలుగు భాషా చరిత్ర

లకూ భేదమేమంటే ఫైవాటిలో ప్రథమైకవచనంలో, మహదహమద్భేదాలుండవు. క్లీబవాచకంలో ఏకత్వబహుత్వభేదమూ ఉండదు. కాని ఇందులో వాడు, వారు, అది, అవి అనే సర్వనామాలు చేరటంచేత సర్వనామాల్లో కనివించే లింగభేదం ఇందులోనూ కనిపిస్తుంది.

(అ) భూతకాలం : కట్టించినారు (SII 5. 36.27,1422), సమర్పించినాడు (పై.5.1229.9,1495), పెట్టినారము (పై. 6.798.12,1425). ఇట్టివి భవిష్యత్కాలంలోనూ ప్రయోగింపబడుతాయి. యీ ధర్మము యిట్టపాలింపక ముందటికి యెవ్వరు దప్పినాను పంచమహాపాతకాలుంన్ను చేసిన పాపానం బోఇనారు (పై. 10.586.21,1448) మొ.వి. అయినది అనడానికి 'అఇంది" అనీ కనిపిస్తుంది. (పై. 5.1175.11.1419) మొ.వి.

(ఆ) వర్తమానం : శాసనాల్లో వర్తమాన క్రియారూపాలు చాలా అరుదు. కాబట్టి పూర్వయుగందాకా శాసనభాషలో వర్తమాన క్రియారూపాల్ని గురించి అట్టే తెలియటం లేదు, కాని ఈ యుగంలో సామాన్యసమాపకక్రియారూపాలు కొన్ని కనిపించాయి (చూ§. 5.48(అ), సంశ్లిష్ట వర్తమానార్థకరూపం ఒక్కచోట మాత్రం కనిపిస్తుంది. సేవచేన్తున్నాండు ( SII 4.936.27,1453). ఈ యుగంలో శత్రర్థంలో -చున్ ప్రత్యయంతోడి రూపాలు తగ్గి -తున్ ప్రత్యయంతోడి రూపాలు ఎక్కువవటంచేత చేస్తున్నాడు వంటి రూపాలు వర్తమానార్థం ప్రచారంలో ఉండేవని చెప్పవచ్చు (చూ§. 5.58).

(ఇ) భవిష్యత్తు : అన్నంత క్రియారూపాలకు -కల చేరితే భవిష్యత్క్రియాజన్యవిశేషణ మేర్పడుతుంది. చేయు-చేయంగల మొ.వి. ఇట్టివాటికి రెండురకాలైన ప్రత్యయాలు చేరి సమాపకక్రియలు అవుతాయి. (1) పై భూత, వర్తమాన క్రియలలాగానే వాండు > ఆండు, వారు > ఆరు, అది, అవి చేరి సమాపకక్రియలుకావచ్చు. (2) విశేషణరూపాలకు. -౦డు, -రు, -వు -ను, -ము చేరి సమాపకక్రియలు కావచ్చు. ఉదా : జరపంగలవాండు (SII 5.129. 7,1422), చేయంగలారు (పై. 5.1180.12, 1402), పెటంగలారు (పై 6.1100.8,1407), మొ.వి. (2)పెటంగలడు (పై. 6.1082.11,1102), కౌలువంగలడు (పై. 6.1072.8,1413) (స్త్రీ) కొలువంగలడు (పై.6.710,12,1409), వెలువంగలదు (పై. 5.1185. 15, 1480) (క్లీబం) మొ.వి. ఈ రెండు రకాల రూపాలూ విశాఖ-శ్రీకాకుళ౦ ప్రాంతంలో మాత్రం కనిపిస్తాయి.