పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం 157

డు మంతరూపాల్లో డుజువై -ఇ చేరగా వానిపై -ని చేరి ద్వితీయారూపం కావడం ఈ యుగంలో తరచుగా కనిపిస్తుంది. బ్రహ్మేశ్వరుంణ్ని (SII 10.749 24,1583), (-డి -ని చేరి ణ్ని అవుతుంది). బ్రాంహ్మణి (పై. 10.745.61,1530) మొ. వి.

5.30. తృతీయావిభక్తి : పూర్వయుగంలో పద్మశాసనాల్లో మాత్రం కనిపించిన-మెయిన్ ప్రత్యయం ఈయుగంలో కనిపించదు. ఈయుగంలో కనిపించేవి ఈ కిందివి.

(అ). చేతన్‌, చేన్‌ తోడన్‌, తోన్‌,

చేతన్‌, చేన్‌ : పూర్వయుగంలో ఈ ప్రత్యయాలు సాధారణంగా గ్రహ్యార్దంలోనే కనిపించేవి. కాని ఈ యుగంలో ద్వారా అనే అర్ధంలోకూడా కనిపిస్తాయి. దేవరలకు నిత్యకృత్యముగాను వొడాడదేవనచేతను యెత్తించి (SII 5.14.4,1410), చిన్నాదేవమ్మ చేతచు రత్నమహాదానమున్ను తిరుమలదేవి అమ్మవారి చేతను సప్తసాగర మహాదానమున్ను సేయించ నవధరించి (పై. 6.248.33,1515) చె > చా మార్పుచేత ప్రత్యయానికి చాత అనే రూపం కూడా తరుచుగా కనిపిస్తుంది. తమ దేవుళు చింనాదేవంమంగారి చాతాను సమర్పించిన పదకం (పై.6.694.3,1516), ప్రతాపరుద్రగణపతి మహారాయల చాతను పుచుకొంనగ్రామాలు. (పై 6.695.2, 1519) మొ. వి

తల్లి సూరాంబచే సముత్ప [౦]న్న మగుచుం బరగు(పై.10.582.6,1415), జలక్షేత్రము వీరిచే వృతింగాబెటేను (పై 6.1061,5,1374) మొ.వి.

(ఆ) తోడన్‌, తోన్‌ : ఈ ప్రత్యయాలకు ఈ యుగంలో ప్రయోగంచాలా తక్కువ. ఇవి సహార్థంలో ప్రయోగింపబడతాయి. ఊరుంగాయలతోడను ఆరగించి (SII 4.981.7,1518), అన్మతోయుజ 14 గంగుతోయ జ 168 నున్న కాముతో...(పై. 5.26.5,1412) ఇక్కడతో కళగా కనివెస్తుంది. అందులోను ఇది సంప్రదానంలో ప్రయోగింపబడి ఉంది. ఈ తోడ శబ్దం సమాస గతమైనప్పుడు తోడి అనడం సహజం. కల్యాణవేదితోడి శిలామండపం (పై. 5.113.58,1416). కాని ఈ యుగంలో తోటి అని ఆధునికరూపం మొదటి సారిగా కనిపిస్తుంది.