పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం

149

అని పలుసార్లు శకటరేఫకు బదులు సాధురేఫ కనిపిస్తుంది. అంటే చెఱువు (పై. 4.702.124,1518) మొ.వి. కేవలం వ్రాతలో మాత్రం నిల్చిఉ౦దనీ ఉచ్చారణలో ర ఱ ల భేదం పోయిందనీ చెప్పవచ్చు.

5.13. పదాది హల్లుతో రేఫ సంయక్తమై ఉంటే అట్టి సందర్భంలో రేఫకు లోపం జరగడం కిందటి యుగంలోనే చూశాం (4+14),కాని ఈ యుగంలో ఈ లోపం చాల తరచుగా సంభవిస్తుంది. ఉదా. కొత్తయింటికి (SII 4.711.81, 1593), పెగ్గడ (పై. 6.1027.8,1415) మొ.వి. ఒక్క క్రింద శబ్దమే తీసుకొన్నా అనేక ప్రయోగాలు కనిపిస్తాయి. చెఱువు కింద (పై 4.702.121,1518), కిందిదమడి (పై. 4.702.128,1518), చెర్వుకింద వరిమడి. (పై.4.702.240, 1518), చెర్వుకింద (పై. 4.686.14,1580), నగరి కింది (పై. 5.86.20,1422), పినచెరువుకిందను (పై.10.785,18,1524)మొ. వి.

5.14. దీర్ఘం తర్వాత యకారానికి ద్విత్వమున్ను దీర్ఘానికి హ్రస్వమున్ను కావడం శాసనభాషలో తరుచుగా కనిపిస్తుంది. ఇట్టివి ఇంతకు పూర్వపుయగంలో తరచుగా తత్సమపదాల్లోనే కనిపిస్తాయి. తృతియ్య, రమణియ్య మొ. వి. నేయి, వేయి మొదలగు దేశిపదాలు నెయి, వెయి అని హ్రస్వయక్తరూపాలు తరచుగా కనిపిస్తాయి. కాని నెయ్యి, వెయ్యి వంటి రూపాలు క్వాచిత్కంగా కనిపిస్తాయి. తక్కిన దేశిపదాల్లో ఇట్టి మార్పు అరుదుగా కనిపిస్తుంది. కాని ఈ యుగంలో దేశిపదాల్లోనూ పై మార్పు తరచుగా కనిపిస్తుంది. పొయ్యం గలారు (SII 6.817.16, 1408), ఇయ్యంగలారు (పై. 6.817.19,1480), చెయ్యంగాను (తె.శా. 1,156. 8,1551), చెయ్యక (SII 4.659.10,1485) మొ.వి.

5.15. నాయుండు, బోయుండు శబ్దాల్లోని మధ్యఅక్షరానికి లోపం శాసనభాషలో సర్వసహజంగా కనిపిస్తుంది. బోయ శబ్ధానికి బహువచన ప్రత్యయం పరమయేటప్పుడు యకారలోపం అతి ప్రాచీన శాననాల్లోనే కనిపిస్తుంది. ఉఱుటూరిబోళ రెండుట్టియు, బోళచేత శవణగొణిరి. మొ.వి. బహుత్వం పరమయ్యేటప్పుడు గుంటూరు, గోదావరి మధ్యశాసనాల్లో యకారం తప్పనిసరిగా లోపించి, నెల్లారు శాసనంలో లోపించని రూపంకూడా కనిసిపించడంచే (బోయలన్-ధర్మవరశాసనం) ఈ లోపం గుంటూరు, గోదావరి మధ్యంలో ప్రారంభమైనట్లు చెప్పవచ్చును. 11వ శతాబ్దం నుంచి ఏకవచనరూపమైన బోయుడు శబ్దంలోను యకారం లోపించి