పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

142

తెలుగు భాషా చరిత్ర

పైన చెప్పిన మార్పులు గొఱియలు అనే పదంలో కూడా చూడవచ్చు ఈ శబ్ద౦ శాసనాల్లో కొల్లలుగా కనిపిస్తుంది. ఈ గొఱియలు శబ్దానికి శాసనాల్లో 13వ శతాబ్ది నుండి మూడు రకాలైన మార్పులు కనిపిస్తాయి. 1. వికాఖ- శ్రీకాకుళం ప్రాంతంలో గొఱ్యలు అని -ఇ- లోపించడం. 2. మధ్యాంధ్రంలో గొఱ్రెలు అని -ఇయ > -ఎ కావడం, 3. నెల్లూరు-దక్షిణ గుంటూరులో -ఇయ > -ఉ కావడం లేదా -ఇయ పూర్తిగా లోపించడం గొఱ్రులు/గొర్లు జరుగుతుంది.

దీన్నిబట్టి ఆంధ్రదేశంలో ఆనాటికే (1) విశాఖ-శ్రీకాకుళం (2) మధ్యాంధ్రం (3) దక్షిణాంధ్రం (నెల్లూరు-దక్షిణ గుంటూరు) అని మూడు మాండలికాలు ఉన్నట్లు చెప్పవచ్చు. ఈ యుగశాసనాల్ని బట్టి తూర్పు పశ్చిమాంధ్రాల్ని (తెలంగానా-సర్కారు) వేరువేరు మాండలికాలు అని చెప్పడానికి చాలినంత ఆధారం కనిపించటం లేదు.

జ్జాపికలు

1. Mehandale M.A., Historical Grammar of Inscriptional Prakrit's పేజీలు 86, 134 196, 237.

2. మాండలిక వృత్తి పదకోశం, ప్రథమ సంపుటం. పేజీ. 38.

3. V. Ramachandra, A Critical study of Errapreggada's works, thesis submitted to S. V. University, Tirupathi.1964. పేజీలు 194,197

4. ఎం. కందప్పశెట్టి. వేయి శబ్దవిచారము. భారతి. మార్చి 1978 మద్రాసు.

5. నన్నెచోడుని కుమారసంభవంలో పై ప్రత్యయాల్ని పరిశీలిస్తే తేలిన సారాంశం ఇది. (చూ. ఎం. కందప్పశెట్టి. 11వ శతాబ్టి వర్తమానార్ధక క్రియలు భారతి. సెప్టెంబరు , 1968 మద్రాసు).

6. Lisker, Introduction to Spoken Telugu. పేజీ 243. ఇట్టి ప్రయోగాలు విశాఖ-శ్రీకాకుళం మాండలికంలో నేటికి ఉన్నట్టు శ్రీ వి. రాధాకృష్ణగారు అన్నారు.

7. మాండలిక వృత్తిపదకోశం, ప్రధమ సంపుటం, పేజీలు 46-52.

8. ఈ యుగవు శాసనభాషకు, మాండలికాలు విశేషాలకు చూ. M. Kondappa Chetty, Historical Grammar of Inscriptional Telugu. Thesis submitted to S. V. University, Tirupati. 1966. పేజీలు 432-445.