పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శాసన భాషా పరిణామం

119

ఇనుప ఎడ్లు ( SII 4.1156.11, 1185 ) (ఇనుము = నల్లని, ఎడ్లు = గృహజంతువులు) ; మొ. వి.
   (చ) ద్వంద్వసమాసం : తల్లిదండ్రులు ( SII 6,125.82,1172) కూరకాయలు (పై. 10.33. 4.96,1251), మొ.వి. మొదటిరూపంలో తకారం దకారం అయింది. రెండవదానిలో “క”, వర్ణం “గ" కాక పోవడం గమనార్హం. ఏకవచనాంతమైన ద్వంద్వసమాసరూపాలు కూడా ఉన్నాయి. ఇట్టివి 18 వ శతాబ్దం నుంచి కనిపిస్తాయి. తల్లి తండ్రి ( SII 6.90.8 1341), కాయకూర (పై. 7.904.28,1291) మొ. వి.
   (2)తత్సమం : సంస్కృతసమాసాలు అలాగే తీసుకొన్నవి.  సహస్రనామార్చన (SII 6.1212.11 1210), జలధార (పై. 6 43,16, 1192) మొ.వి.
   (3) మిశ్రసమాసం : ఇవి తెలుగు పదాల స్థానాన్ని బట్టి రెండు రకాలు. 
   (క) తె + సం : తలరాసి. (SII 4.1058.6, 1149), వెంజామర (పై. 4,1190.4.1143) మొ. వి.
   (ఖ) సం + తె : చామరకొలుపు(పై.6.756.10, 1113), దీపమాన్య (పై. 6.1203,7 1226) మొ. వి.
   (4) వర్ణలుప్తసమాసం : తిరువజాము (తిరువర్థజామ) (SII 6.742, 6, 1372), మంజుతెర ( మంజిష్ఠ తెర ) (పై. 5.1216.4, 1314 ), హవిలి (హవిబలి) (పై 10.131.14, 1158) మొ. వి. 
   

4.38. వచనం

   (క) -రు : మానవవాచకాల్లో (human nouns) కొన్నింటికి బహువచన ప్రత్యయంగా - రు వస్తుంది. అల్లురు (SII 10.164.6,1168 ), దీనురు ( పై. 6.628.115, 1224) మొ. వి.
   
   (ఖ) -ఱు, ౦డ్రు, -౦ఱు, -౦ఱు : -కా- ప్రత్యయం మీద మహత్తులో పై ప్రత్యయాలు వస్తాయి, వాద్యకాఱు ( SII 10,707.14, 1153), మద్దెల కాండ్రు (పై. 5.1188,65- 1250), ఒత్తుకాంఱు (పై. 6.955.9, 1349), వాస్యకాంఱ్రు (పై .6.1116.13,1376).