పుట:తెలుగు భాషాచరిత్ర.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

98

తెలుగు భాషా చరిత్ర

29-31, 625.50), శవన బోళకు...మఱుపొలము పన్నస ఆడి యిచ్చితిరి (AR 283/1949-50.4-8 8). (ii) కర్మలేనివి : కఞ్చగార్లు కొట్టిరి (EI 30.69-71.8, 699-700), ప్రభురామున్ఱుక్ఱోచె ( NI 2.606-7.13-14, 8 ) మంగడ్ల కొమ్మన కొలచి పెట్టె కట్టె ( SII 6.250.7. 742-99 ). (iii) వాక్యాంతంలో కర్త : ఉదా. ప్రసాదచేసిరి తొల్బకామి రట్టగుళ్ళు ( EI 27 236-33 12-15, 700-25), దీవియ పెట్టెం బద్మావతియును (పై. 4.314-18.21, 1075. 76). రెండోవాక్యం పద్యశాసనంలోది. (iv) వాక్యాంతంలో కర్మ ఉదా. గణ్డర ముత్రాజు ... పొడిచిపడియె ఱోజ్కుళాకు ( SII 10.640. 3-6, 9/10), మల్లణ్డెత్తించె గుడియు మఠంబునుం గాత్తి౯కేయునకు (శా.ప.మం. 1.2-3-27-29, 898.934). రెండోది పద్యశాసనంలోని వాక్యం. (V) కర్మ-కర్త-క్రియ : ఉదా. శ్రీసతికి దత్తి హంగుణువుళ దేవణయిచె (AR 182/1933-34, pt. II, lc, 41 1-8,7). (vi) కర్తృ పద పునరుక్తి : ఉదా. పెటనివారు... ఆఱిసినవారు పాపంబు గొణ్డు వెటనివారు (SII 10.633.2-5, 8) (vii). విశేష్యం -విశేషణం : ఉదా. నిల్పె విద్ధమయ్య విప్రకవచమ్బు (NI 1.287.4,650), శ్రీయుద్ధమల్లు ణ్డెత్తించె నమితతేజుండు (శా. ప. మం. 1.2.43-44, 898-934). వీటిలో రెండో వాక్యం పద్యశాసనంలోనిది. (viii) పరోక్షకర్మ, ప్రత్యక్షకర్మ ; ఉదా. గణ్డుదేవరకు నముదునకు దారపోచి యిచ్చినాణ్ణు (AR 77/1956-57. 13-15, 1096) (ix) క్రియ-అవ్యయం : ఉదా. సితమణి బన్దమిచ్చె సన్మణియుతముగన్‌ (RPS 25-29.6,1065). ఇది పద్యశాసనంలోది.

   3.74. యత్తదర్ధక యోగం : సంస్కృత మర్యాదానుసారి అయిన యత్తదర్థక ప్రయోగం గల వాక్యాలు నాలుగే లభిస్తున్నాయి. ఈరకం వాక్యాలు క్రీ. శ. 9/10 శతాబ్దినుంచి మాత్రమే-అందులోనూ విరళాతి విరళంగా-కనిపిస్తున్నాయి. ఉదా. నీకేమి వలయు దాని వేణ్ణికొమ్మ్‌ (తె.శా. 1.163-65.30-32, 892-922), ఎవ్వణ్డేని రక్షిఞ్చు వానిద ధమ్ము౯వు (JAHRS 1.81-85.7, 10); ఈవృత్తి ఎవ్వా౦డేని అపవారించిన నాని పితృపితాంమహంలు 60 వేలే౦డ్లు నయకనరకానం పడుదురు ( SII 10.4.12-14 1008 ); వేగినాణ్టి కెవ్వరు రాజులైరి వారుం భూవ౯స్థితిం దప్పక పాలించువారు ( పై. 6.102.34 88, 1006).