పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

52

తిరుమల తిరుపతియాత్ర.


యించెదరు. పిమ్మటసన్నిధిలో శ్రీపాదరేణువ కలుపఁబడి కొంత భాగము వచ్చే శుక్రవారమువరకు వినియోగమునకు దేవ స్థానపు పారుపత్యదార్ వద్దకు వచ్చును. కొంత భాగము జియ్యంగార్లకుఁజేరును. స్వల్పముగ ఇతరకైంకర్యపరులలో కొందఱికి ఇయ్యఁబడును. పారుపత్యదార్ వద్దనున్నది. వచ్చేశుక్రవారము వరకు ఖర్చుపోను మిగిలినంతట గౌరవార్థము కొందఱు ఉద్యోగస్థులు మొదలగువారికి నియ్యఁబడును. శ్రీవారికి కేసరి సమర్పణమయిన వెంటనే యభిషేకతీర్థము క్రిందఁబడ కుండఁగఁ బట్టఁబడును. ఈఅభిషేకదీర్థము యాత్రికులు ఇంటికి తీసుకొనిపోవుటకు కోరినంతట పారుపత్యదార్ ఉచితముగనిప్పించును.

అభిషేకానంతరము పూర్తిగ నలంకారమయిన తఱువాత శ్రీవారి స్వర్ణ తాయార్ల వారికి నభి షేకమవును. ఇదిరహస్యము, ఇతరులు పోఁగూడదు. ఆఁడవాండ్రమాటఁజెప్ప నక్కఱలేదు. ఇదియయిన తఱువాత నిత్యము సొమ్ముఁచెల్లించి యాత్రికులు దర్శించుతోమాలసేవ, అర్చనయయి రెండవ ఘంట కాఁగా ధర్మదర్శన మవును. అనంతరము శుద్ధిరాత్రి తోమాల సేవ అర్చన ఘంట అయితీర్మానము మామూలు ప్రకారమవును.

N. B. విశేష వుత్సవాదులున్నంతట విశ్వరూపదర్శనమునకు గాని, రాత్రి ధర్మదర్శనమునకుగాని కొన్ని వేళల నవ కాళ ముండదు.