పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండవకూర్పునకు పీఠిక.


ఈ పుస్తుకము మొదటికూర్పు అయిపోయి రెండవకూర్పు వేయనవసరము గలిగి నందున యాత్రికుల కుపయోగార్ధము తీర్థములు గుఱించి ఒక్క అధ్యాయము చరిత్ర అనునొక అధ్యాయము నిందు చేర్చబడి ఈ దేవస్థాన మిపుడెటుల పాలింపబడుచున్నదో ఆపద్ధతియు నించుక నిక్కడ వివరించెదను.

శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానము క్రీస్తు శకము 1646-వ వత్సరము వరకు హిందూ రాజుల వలనను, క్రీస్తు శకము 1801-వ వత్సరము వరకు మహమ్మదీయ రాజుల వలనను, అనంతరము ఇంగ్లీషు ఈస్టు ఇండియా కంపెనీ వారి వలనను పాలింపబడెను. (Vide Gazetteer of South India & Volume 5 of the Imperial Gazetter of India.)

గౌరవ నీయులగు కోర్టు ఆఫ్ డైరక్టర్సు వారును, గవర్నమెంటు ఆఫ్ ఇండియా వారును 1840-1841 సంవత్సరములలో దేవాలయములు, మసీదులు; మతసంబంధమై జనులు జేరునటువంటి ఇతర ప్రదేశముల పారిపాలన విషయమై సర్కారు ఉద్యోగస్థులు ఏమాత్రము ప్రవేశించ గూడదనియు అప్పుడు సర్కారు వారి ఆధీనములో నుండు నటువంటి దేవాలయములు మొదలగువార్లను ఆయామతమునకు చేరిన వారికే స్వాధీనము చేయవల్సినదని ఆజ్ఞాపించిరి. 1841 సంవత్సరములో ఆ ఉత్తరవు ననుసరించి ఆలోచన సభతో కూడిన మదరాసు గవర్నరు గారు రెవిన్యూబోర్డు వారిని తగు చర్యలను తీసుకోమని వ్రాసిరి. సర్కారు వారు పరిపాలించుచుండిన దేవాలయములు మొదలగు అన్నిటికి ట్రస్టీలను ఏర్పరచి వారిస్వాధీనము చేయునపుడు శ్రీ వేంకటేశ్వర స్వామివారి దేవస్థానములో మిరాశీ