పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

36

తిరుమల తిరుపతి యాత్ర.


మంగలి కట్ట.

తిరుమల గ్రామమునకు ముందుండు రావి చెట్టుకు సమీపాన యాత్రికుల ప్రార్థనల ననుసరించి జుట్టు తీయుటకు పని చేయు ప్రదేశము కలదు. దీనికే మంగలి కట్ట యని పేరు. అట్టి ప్రార్థనలున్న వారు పుట్టు జుట్టు తీయుటకు రు.0-4-0 న్ను యిదివరలో పనిచేయబడి మొక్కుకు గాను పెంచబడిన జుట్టు తీయు టకు రు. 0-3-4 న్ను మనిశి 1-కి మంగళ్లకియ్యవలెను.

డిస్పెంసరి.

తిరుమల గ్రామమునకు ముందు మంచి కట్టడములు గలవు. అందులో నొకటి డాక్టరు ఉండుటకును ఇంకొకటి మందులు ఇచ్చుటకు హాసుపాత్రిగ నున్నది. ఇందులో ధర్మముగ మందులు అందరియ్యబడును. ఇది దేవస్థానం శ్రీ విచారణ కర్తల వారి వలన ఏర్పటు చేయ బడినది.

భోజనము.

1.దేవస్థానములో రేయింబగలు ఎందరు దేశాంత్రులకు అయినను ప్రసాదము భోజనమున కిచ్చెదరు. 2.మైసూరు గవర్నమెంటు వారి సత్రములో బ్రాహ్మణులకు మద్యాహ్నము ఒక్కపూట భోజనమిడెదరు.

హోటల్.

బొజనమిడు బ్రాహ్మణ హోటల్ ఒక్కటి గలదు. కాఫీ హోటల్సు అనేకము గలవు. అందులో నొకటి కొచ్చి సారస్వత బ్రాహ్మణులది గలదు.