పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

30

తిరుమల తిరుపతియాత్ర.



ఉత్తరపు వీధి.

1. హిందూస్థాన్ రామాంజీ కూటము.

ఈ వీధిలోను పశ్చమవీధిలోను హిందూస్థాక్ రామాంజీకూటములు కలవు. ఉత్తర హిందూస్థానమునుండి వచ్చిన వైష్ణవులకు భోజనము పెట్టెదరు. హిందూస్తానీ షాహుకార్లు ఈ రామాంజీ కూటములకు నిండా ద్రవ్యసహాయము చేసెదరు.

2. వ్యాసరాయ స్వాములవారి మఠము.

ఇది నిండా శిధిలమైయున్నది. నివాస యోగ్యము కాదు.

3. అర్చకులు ఇండ్లు.

ఈవీధిలో అర్చకులు నివసించెదరు. శ్రీవారి బ్రహ్మోత్సవములో తప్ప తదితర కాలములలో అర్చకులయిండ్లు చాల భాగము ఖాళీగానుండును. పూజ చేయు వంతుగల అర్చక గుమాస్తాలు మాత్రము సదాయుండెదరు.

4. రాతి తేరు.

ఈశాన్యమూలలో రాతి తేరుగలదు. శిలాశ్వములు చక్రములు భూమిలో పూడియున్నవి. తేరునకు గోపురమువలె నుండు పై భాగము పడిపోయినందున ఇప్పుడు మంటపమువలె తెలియుచున్నది. ఈ తేరు పూర్వమెప్పుడో శ్రీవారి బ్రహ్మాత్సవములో నెనిమిదవరోజు ప్రస్తుతముపయోగించబడు కొయ్య తేరువలె నుపయోగింపబడుచుండె నని చెప్పెదరు.

తూర్పువీధి.

1. శ్రీ ఉత్తరాది స్వాములవారి మఠము.