పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

తిరుమల తిరుపతియాత్ర

పంచములు మొదలగువారు

నాలుగుజాతుల హిందువులుతప్ప నితరులు గొండనెక్కఁగూడదు. అలిపిరివద్ద శిలామనుజుడు సాష్టాంగముగఁ బడియున్నాఁడు. అదిదాటి రాఁగూడదు. 1871-వ సంవత్సరములోని గవర్నమెంటువారి ఉత్తరవు ప్రకారము మెజస్టీరియల్, పోలీసు యూరోపియన్ ఉద్యోగస్థులప్పుడప్పుడు పోయెదరు. పంచములు గపిలతీర్థమునకు సమీపమున మాదిగవాని గుండములో స్నానముచేసి తిరుపతిలో దేవస్థానపు విచారణకర్తలవారి ఖచేరిలో ముడుపులఁ జెల్లించి రసీదుఁబొందెదరు. మహమ్మదీయులు గూడ నీ ఖచ్చేరీలో ముడుపులు చెల్లించుటగలదు.

అధ్యాయము II.

1.తిరుమల

తిరుమల అనగా శ్రేష్టమైనకొండ అని అర్ధము. ద్రావిడ భాషయందు శ్రీవైష్ణవసిద్ధాంతములో తిరు అనునది. శ్రేష్ఠ వాచకము. మలై అనుశబ్దమునకు పర్వతమనియర్ధము. ఈ పర్వతము తూర్పుకొండలలో నిది. 2500 అడుగులు యెత్తున్నది. తిరుమల అనెడి పేరుకంటె తిరుపతికొండనియు, తిరుపతి మలైయనియు విశేషముగ వాడబడును. ఉత్తర హిందుస్థాన్ దేశస్థులు త్రిపతి అని వాడెదరు. (ఈకొండకు కృతయుగములో వృషభాచలమనియు త్రేతాయుగములో సంజనాచలమనియు ద్వాపరయుగములో శేషాచలమనియు కలియుగములో వేంకటాచలమనియు పేర్లుగలవు. ఆపేర్లకు కారణలెవ్వన: