పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమల తిరుపతి యాత్ర

125

కొని ఇంగ్లీషువారికి వ్రాసి యిచ్చిన రీతిగా కవులు వ్రాయించు కొని కొంచెము సైన్యము ఈ నూతన సంపాద్యమును కాచుటకు వుంచి అందరు పోయిరి. 1759 మహారాష్ట్ర సేనాని గోవింద గోపాల రావు ఫ్రెంచి వారొసగిన స్వల్ప పారితోషకమునకు తృప్తి చెందక తిరుపతిని గంగమ్మ జాతరకు ముందు ముట్టడించి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానమును తిరుపతియు లోపరచుకొనెను. అచ్చట నుండి పన్ను వసూల్ చేయదలచెను గాని మే నెలలో కృష్ణా నదీ వరదలు వచ్చునని పూనాను బాలాజీ రావు వాఫసు రమ్మనగా నారాయణ శాస్త్రి , అను వాని చేతి క్రింద కొంచము సేననుంచి తిరుపతిని వదలెను ఇంగ్లీషువారితో స్నేహముగా నుండిన నవాబు సహోదరుడగు అబ్దుల్ వహాబు చంద్రగిరి నుండి ఇంగ్లీషు వారితో చేరి తిరుపతికి స్వల్ప సేనను పంపి లోబర్చుకొని దేవస్థానము తన స్వాధీనము చేయ మని కోరెను. గాని ఇంగ్లీషు వారు యిదివరలో నుండిన యిజారా దారు కొనసాగిరి. నారాయణ శాస్త్రి తిరుపతికి 15 మైళ్ల దూరమునున్న కరకంబాడిలో కొంతకాలముండి మట్ల వారి సహాయము వలన సేనను చేర్చుకొని ఇంగ్లీషు సేనానీ విల్ క౯ తన సేనతోను యిజారాదారుని సేనతోను యాత్రీకులు వచ్చు కొండ మార్గము కాచు చుండగా మారు త్రోవను కొండెక్కి దేవస్థానమును స్వాధీనము చేసికొనెను. జూలై నెల తే. 9 దిని కొండ నుండి మహారాష్ట్రులును, క్రిందనుండి మట్ల వారును ముట్టడించిరి గాని ఓడిపోయిరి. దేవస్థానము యింకను వారి స్వాధీనములో నున్నది. తిరుగ మద్రాసు నుండి సేన, ఫిరంగులు, విల్ క౯సేనాని సహాయమునకు వచ్చెను. నాలుగు జాతుల హిందూ సిఫాయిలు