పుట:తిరుమల తిరుపతి యాత్ర.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

viii

భీతి లేక జనులు సంచరించునటుల వాషింగ్ టన్ లైట్లు మొదలగు దీపము ఏర్పాటు చేసినారు. తిరుమలలో యాత్రికుల చంటి పిల్లలకు ధర్మారముగ ఆవు పాలిచ్చుటకు ఏర్పాటు చేసినారు.

శ్రీ విచారణకర్తల వారివద్ద మంత్రిగ దివాన్ పేష్కార్ అనుహోదాలో నొక ప్రధానోద్యోగి గలరు. వారు దేవస్థాన ములు, తాలూకాలు మొదలగు అన్నిటిని పాలించుదురు. వీరు శ్రీ విచారణకర్తల వారి ఖచేరిలో నుండెదరు. వీరి చేతిక్రింద తిరుమలమిదపారుపత్య దార్ ప్రధానోద్యోగస్థుడు. (Chief ministeriel officer on Hills)

తిరుపతి దేవస్థానపు ట్రజరర్ (ఖజాన్జి) అనునుద్యోగి గలరు. వీరుస్కీము ప్రకారము జిల్లా జడ్జిగారివలన నియమింపబడి దేవస్థానములోనుండి జీతము పుచ్చుకొనెదరు. దేవస్థానపు సొమ్ము వీరి స్వాధీనములో నుండును. వీరు శ్రీ విచారణకర్తల వారి వలన అంగీకరింపబడిన (ప్యాసు చేయబడీన) బిల్లుల ప్రకారము సొమ్ముబట్వాడా చేయించుచున్నారు.

వత్సరమునకు కొక సారి లేఖలను తనిఖీ చేయుటకు చిత్తూరు జిల్లా జడ్జికోర్టు వారు ఒక్క ఆడిటర్ ను నియమించెదరు. ఆడిటర్ల రిపోర్టులు సరిగా లేనంతట అట్టిలోపములను శ్రీవిచారణకర్తలవారు చూపించుట గలదు.

గ్రంధబాహుశ్యము గాకుండ నిందు దేవస్థానముల పరిపాలన పద్ధతి సూక్ష్మముగా వివరించినందుకు చదువరులు మన్నించెదరు గాక .

ఎన్. వి. లక్ష్మీనరసింహారావు

తిరుమల

5-9-23