పుట:తాళ్ళపాక పదసాహిత్యం - మూడవ భాగం.pdf/522

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


రేకు: 0290-03 సామంతం సం: 03-520 నృసింహ

పల్లవి:

అనిశముఁ దలఁచరో అహోబలం
అనంతఫలదం బహోబలం

చ. 1:

హరినిజనిలయం బహోబలం
హరవిరించినుత మహోబలం
అరుణమణిశిఖర మహోబలం
అరిదైత్యహరణ మహోబలం

చ. 2:

అతిశయశుభదం బహోబలం
అతులమనోహర మహోబలం
హతదురితచయం బహోబలం
యతిమతసిద్ధం బహోబలం

చ. 3:

అగు శ్రీవేంకట మహోబలం
అగమ్య మసురల కహోబలం
అగపడుఁ బుణ్యుల కహోబలం
అగకులరాజం బహోబలం