పుట:తాళ్ళపాక పదసాహిత్యం - నాలుగవ భాగం.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రేకు: 0308-04 సౌరాష్ట్రం సం: 04-046 విష్ణు కీర్తనం
పల్లవి: నేము సేసేయందు మారు నీవే చేకొంటివి
నేమపు నాపూజలెల్లా నీకు నెక్కెనయ్యా
చ. 1: పాలజలనిధిలోనఁ బవ్వళించినది యేపో
వాలిన నీకు జలాధివాసము
కోలు ముందై బ్రహ్మయజ్ఞ కుండములాహుతి గొని
వోలినుండే అది నీకు హోమము
చ. 2: ఆడన `నాపోనారామణుఁడ` వయిన నీకు
ఆదియపో మంత్రకలశాభిషేకము
మొదల నంతర్యామిమూర్తివయిన నీకు
పదవిమీర నదియే ప్రాణప్రతిష్ఠ
చ. 3: అక్కున శ్రీవేంకటాద్రి నలమేలుమంగఁ గూడి
వొక్కటై వుండినదే నిత్యోత్సవము
లెక్కలేని వరములు లీలతో మా కిచ్చితివి
యిక్కడ నేపొద్దు మాయింట నుండవయ్య