ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0370-04 సామంతం సం: 04-413 హనుమ
పల్లవి:
చెల్లె నీచేఁతలు నీకే చేరి మేడెగుడిదిన్న
నల్లదె కంటిమి నిన్ను హనుమంతురాయ
చ. 1:
జంగ చాఁచినట్టి నీ సంగడి పాదములు
చెంగలించి యెత్తిన నీ శ్రీహస్తము
ముంగలిఁ బిడికిలించి మొలఁజేర్చినచేయి
అంగమాయ నీ సొబగు హమమంతరాయ
చ. 2:
పెరిగినవాలము పెద్దైన పిరుఁదును
అరిగి జలధి దాఁటే యాయితమును
సిరుల బంగారు కాసె చెలఁగిన సింగారము
అరుదాయ నీవునికి హనుమంతరాయ
చ. 3:
స్వామి కార్యపుఁ జింత జానికి సేమపువార్త
దీమసాన మగుడి యేతెంచిన చేఁత
రామ నామ జపముతో రతి శ్రీ వేంకటపతి-
కా మేటి బంటవైతివి హనుమంతరాయ