ఈ పుట అచ్చుదిద్దబడ్డది
రేకు: 0298-2 రామక్రియ సం: 09-284
పల్లవి:
ఏల మమ్మురేఁచేవు యింతఱట్టు మా కేఁటికి
మేలు మీఁదనుండరాదా మెప్పించేఁగాని
చ. 1:
మాయదారిమాటలేల మరఁగుననున్న యాపె
చాయల నీ మోహపు సతిగాదా
తీయరాదా నీచేతనె తెరమరఁ గించుకంతా
చేయిచాఁచి నీ కన్నియుఁ జెప్పి చూపేఁగాని
చ. 2:
యీడుగాని యానలేల యింటిలోన నున్న యాపె
జోడుగ నీ ప్రాణమైన సుదతిగాదా
యేడసుద్ది గడియ దీయించరాదా నేఁ జూచి
యీడనె పేరుఁ బెంపు నీ కెత్తియిచ్చేఁగాని
చ. 3:
సారెకు నవ్వులేల పచ్చడములోనున్న యాపె
కూరిమి నీ కొత్తపండ్లికూఁతురుగాదా
చేర నా కెదురువచ్చి శ్రీవెంకటేశ కూడితి
వూరకుండరాదా నీకు వొప్పగించేఁగాని