పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0001-5 కాంబోది సం: 05-005

పల్లవి:

రాకుంటే మానుఁగాక రంతులేఁటికే
వేఁకపు గుబ్బలాండ్ల విటుడాఁతఁడు

చ. 1:

అంపిన కప్పురమొల్ల నంటేఁ దాననుఁ గాక
వంపు మోముతోడ నీకు వాడనేఁటికే
చెంపల లప్పలు నిండఁ జెరిగిన కప్పురపు -
గంపకొప్పుల సతుల ఘనుఁడాతడు

చ. 2:

ఒద్దికగాకక్కడనే వుంటే దానుండుఁ గాక
ముద్దుమోము వంచి నీకు మొక్కనేఁటికే
చద్దికి‌ వేఁడికి మంచిచక్క సతుల మోవి
పొద్దునొద్దుకారగించే భోగి యాతఁడు

చ. 3:

అబ్బురపు వేంకటేశుఁడైతే దానవుఁ గాక
గబ్బి చూపులెల్లా నీకై గప్పనేఁటికే
జొబ్బిలేటి జవ్వాదిసోనల పన్నీట నన్ను
గుబ్బలంటి సరసానఁ గూడెనాతఁడు