పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0085-5 కొండమలహరి సం: 05-324

పల్లవి:

కొండలోఁ గోవిల గుయ్య గుండె వగిలె నీ-
యండకు రాఁగాఁ బ్రాణమంతలో బ్రదికెరా

చ. 1:

వలచి నిన్ను వెదకి వడి నే రాఁగాను
పులివలె మగఁడుండెఁ బోనియ్యక
తలఁచి నాకంతలోనే తల నొవ్వఁగాను
చిలుకుఁ బులకలెత్తి సిగ్గువలె వలపు

చ. 2:

ఏమరించి యింటివారినెడసి నే రాఁగాను
గామైన బిడ్డయేడ్చెఁ గదలనీక
తామసించి యుండలేక తల్లడించఁగాను
చీమలు మైవాఁకినట్టు చిమ్మిరేఁగె వలపు

చ. 3:

వుండలేక యిప్పుడు నీ వొద్దికి నే రాఁగాను
కొండవలె మరఁదుండెఁ గోపగించుక
బొండుమల్లెపరపుపైఁ బొరలేటి యిట్టి నన్ను
కొండలరాయఁడ నిన్నుఁ గూడించె నావలపు