పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0068-6 భైరవి సం: 05-222

పల్లవి:

ఆనపెట్టుదువు నీవప్పటి నానోరణఁచి వోరి
నీ నిజానకు నాతో నేఁడైన మానరా

చ. 1:

పచ్చడాన జవ్వాది పరిమళమేడదిరా
పచ్చిసేఁతలు చెక్కిళ్ళపై నీకేడవిరా
గచ్చు మోవిమీఁదనున్న కసిగాటులేడవిరా
యిచ్చకుఁడ కనుఁగెంపులేడవి గలిగెరా

చ. 2:

ముద్దుల చక్కని నీదు మోముకళలేడవిరా
కొద్దిగాని సందొత్తుగోరేడదిరా
గద్దరీఁడ యీ చిట్లు గందము నీకేడదిరా
తిద్దెను గస్తూరిబొట్టు దిమ్మరి యెవ్వతెరా

చ. 3:

భీతితో నీవాడేటి తబ్బిబ్బుమాటలేడవిరా
రాతిరేడ నుండితి వెరవక చెప్పరా
యేతరీఁడ తిరువేంకటేశ నన్ను నేలితివి
యేతులతో వలపించ నెంత కలికివిరా