పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఐదవ భాగం.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0064-2 వరాళి సం: 05-194

పల్లవి:

చెలఁగి కూఠాకుగా జేసేవునీ-
తలమీఁదనుండే తరుణిఁబో నేను

చ. 1:

పిసుకకు పలుమారు పసురువేసీ నంత
వసివాడుకోర్చిన వనితఁ గాను
పస రేఁచి నీవింత పాలించు తొల్లిటిఁ
సిసువయిన నీ పెట్టుఁ జెట్టఁబో నేను

చ. 2:

చిదుమకు పరుమారు చెక్కునొచ్చీ నీవు
వదనము నొక్కేటి వనితఁ గాను
ఎదురెదురనే భూమినెందరు లేరు నీఁ
నిదురవుచ్చినవారు నేనెవ్వతిని

చ. 3:

కందించకు నన్నుఁ గౌఁగిట కాఁకల
అందునిందును గడు నలముచును
ఇందిరాపతి వేంకటేశ నీరతుల
పొందు నాకిదె మఱపుకెల్ల నెలవు