పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0058-3 పాడి సంపుటం: 06-099

పల్లవి:

తోడెనే పుండెరువ మందు నేరిచెనె
విడని తలంపు లివి వేఁగీనె తామును

చ. 1:

పతిఁ బాసి మేను తాపమైన నాయెఁగాక
యితవైన యూరుపుల కేమి మూడెనె
సతతమునా హృదయజలజములోఁ బాయని
యతని నంటియుఁ దాప మందెనె తామును

చ. 2:

కినిసి కోరికలు వేఁగినను వేఁగెఁగాక
తనివోని కన్ను లేల తమకించీనె
యెనలేని చూపులనె యెదుటఁ బ్రాణ విభునిఁ
గనుఁగొనుచు వగలఁ గందీనే తామును

చ. 3:

అరిది ముదములకు నక్కరయిన నాయెఁగాక
పరవశముల కేమి బాధ వచ్చేనె
దిరు వేంకటగిరి దేవుని కౌఁగిటఁ గూడి
బిరుసుగ మేను మఱపించీనె తామును