పుట:తాళ్ళపాక పదసాహిత్యం - ఆరవ భాగం.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రేకు: 0045-2 ఆహిరి సంపుటం: 06-020

పల్లవి:

ఇంతగా జేసెఁగా యింతి కన్నుల నగవు
సంతరించగరాని చనుదోయి బిగువు

చ. 1:

తనివి మాలిన తలఁపు తడవోరువని బులుపు
అనువెఱుంగని కెలపు అడియాసమెలపు
కనుఁగలువలో సొలపు కాఁకదీరని యలపు
వనిత చిత్తములోని వడిగొన్న వలపు

చ. 2:

ఒడలెఱుంగని నెగులు నుల్లంబులోఁదగులు
వడియుఁగన్నీటిలో వగలు
పొడలువె ట్టెడి పొగులు పొందు వాసిన దిగులు
పడఁతికి నిది యెల్ల బరికించఁ బగులు

చ. 3:

వెరవెఱుంగని పురపు వింతలాగులయొరపు
మిరుమిట్లు గొనుమేనిమెరుపు
తిరువేంకటాచలాధీశ్వరుని కనుగిరుపు
తరుణి కిటువంటి మెత్తని పూవుఁబరపు