పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

214

వివాహం చేసుకున్నారు. భారత దేశంలో మహిళా ఉద్యమ నీఒకరుగా ఖ్యాతి గాంచిన ఆమెతో కలసి జాతీయ కాంగ్రెస్‌లో పూర్తికాలం పనిచేయడానికి సిద్ధపడ్డారు. 1938 ఉత్తరప్రదశ్‌ కాంగ్రెస్‌ కమిటి కార్యదర్శి అయ్యారు. ఆర్థిక వ్యవహారాలలో నిపుణుడైన ఆయనను ఆర్థిక వ్యవహారాల సలహాదారునిగా జవహర్‌లాల్‌ నెహ్రూ˙ నియమించారు. ఆయన బహిరంగంగా వ్యక్తం చేస్తున్న కమ్యూనిస్టు భావజాలం పట్ల విముఖత గల కాంగ్రెస్‌ నాయకులు కొందరు డాక్టర్‌ అహమ్మద్‌ను కాంగ్రెస్‌ కమిటీ నుండి తొలగించమని డిమాండ్‌ చేసినా నెహ్రూ˙ అందుకు అంగీకరించలేదు.

జాతీయోద్యమం ఊపందుకుని ప్రజలు ఉద్యమిస్తున్న తరుణంలో డాక్టర్‌ అహమ్మద్‌ దంపతులు అద్బుతమైన కార్యదక్షత చూపుతూ ముందుకుసాగారు. అందుకు ఆగ్రహంచిన బ్రిటిష్‌ ప్రబుత్వం ఆయనను జైలుకు పంపింది. ఆయన మీద పలు ఆంక్షలను విధించింది. లక్ష్యసాధానలో ఎటువంటి కష్టమొచ్చినా ఏమాత్రం ఖాతరు చేయని ఆయన మరింత విజృంభించి తన కార్యకలాపాలను కొనసాగిస్తూ ప్రజలలో గుర్తింపు పొందారు.

1943లో భారత జాతీయ కాంగ్రెస్‌ కంటే భారత కమ్యూనిస్టు పార్టీ పట్ల మొగ్గు చూపిన డాక్టర్‌ అహమ్మద్‌ భార్య హజరా బేగంతో కలసి కాంగ్రెస్‌కు దూరమయ్యారు. ఆనాడు కమ్యూనిసుపార్టీ మీద అంక్షలున్నాయి.స్వేచ్చగా పార్టీ కోసం పనిచేసే అవకాశాలు లేవు. అయినా కష్టనష్టాలను భరించడానికి ఆ దంపతులు సిద్ధమయ్యారు.

భారతదేశానికి స్వాతంత్య్రం లభించాక శ్రామికులు-రైతుల కోసం అహర్నిశలు పని చేయటం ప్రారంభించారు. కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఉన్నాపార్టీ కార్యకలా పాలకు దూరం కాలేదు. ఆ కారణంగా పార్టీలో పలు ఉన్నత పదవులు చేపట్టిన ఆయన 1958లో ఉత్తర ప్రదశ్‌ రాష్ట్రం నుండి రాజ్యసభ సబ్యులుగా ఎంపికయ్యారు. ఆతరువాత మరోసారి 1966లో రాజ్యసభ సబ్యులయ్యారు. ఆ తరువాత డాక్టర్‌ అహమ్మద్‌ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్నికయ్యి 2001 వరకు కొనసాగారు.

రైతాంగ సమస్యల పట్ల చక్కని అవగాహన కలిగి రైతు సంక్షేమం కోరుకుంటూ పనిచేస్తున్న డాక్టర్‌ అహమ్మద్‌ 2001 వరకు అఖిల భారత కిసాన్‌ సభకు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఆర్థిక సమస్యల విశ్లేషణ-వివేచన మీద చక్కని పట్టుగలిగిన ఆయన, భారతీయుల దృష్టికోణం నుండి పరిష్కారాలు సూచిస్తూ పలు పుస్తకాలు వెలువరించారు. ఆర్థిక-సాంఫిుక అసమానతలు లేని సమసమాజాన్ని కోరుకున్న డాక్టర్‌ జైనుల్లాబిద్దీన్‌ అహమ్మద్‌ దంపతులు పండు వయసులో కూడా దాశాబ్దాల నాడు నిర్దేశించుకున్న మహయత్తర లక్ష్యాలను సాధించే దిశగా అవిశ్రాంత కృషి సాగించారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌