పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

165

74.మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌

(1888-1958)

భారత జాతీయోద్యమం దశ, దిశను నిర్దేశించి, స్వరాజ్య సాధనలో అగ్రభాగాన నిలచి, జనహృదయాధి నేతలుగా శాశ్వత ఖ్యాతి నార్జించిన స్వాతంత్య్ర సమర యోధులలో అగ్రగణ్యులు మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌.

1888 నవంబర్‌ 11న మక్కాలో జన్మించారు. తల్లి ఆలియా, తండ్రి మౌలానా ఖైరుద్దీన్. ఆజాద్‌ అసలు పేరు అబుల్‌ కలాం మొహిద్దీన్‌ ఖైరుద్దీన. ఆజాద్‌ సాంప్రదాయక విద్యను గరిపిన పిదప కైరోలోని అల్‌-అజహర్‌ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యపూర్తి చేశారు. స్వతంత్ర భావాలు స్వేచ్ఛా,స్వాతంత్య్రాలను అభిలషించే అబుల్‌ కలాం తన పేరుకు 'ఆజాద్‌'ను జోడించుకుని మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ అయ్యారు. మౌలానా ఆజాద్‌ భార్య జులేఖా బేగం గృహ సంబంధిత వ్యవహారాలకు ఆయనను దూరంగా ఉంచి, ఉద్యమస్పూర్తిని కలిగిస్తూ జాతీయోద్యమంలో ఎంతో తోడ్పాటునందించారు.

మౌలానా అరబిక్‌, పర్షియన్‌, టర్కిష్‌, ఉర్దూ భాషలలో మంచి పాండిత్య సంపాదిం చారు. పదకొండు ఏండ్ల వయస్సులో కలం చేతపట్టి, 12వ ఏట నైరంగ్-ఎ-ఆలం పత్రికను తెచ్చారు. 13వ ఏటన సాహిత్య విమర్శను సృజియించిన ఆయన ఆ తరువాత 'విద్యాగని, సలక్షణ శోభితుడు, మహాకవి, సాటిలేని విద్వాంసుడు' అని ప్రశంసలను

చిరస్మరణీయులు