పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

151

67. ముఫ్తీ ఖిఫాయతుల్లా

(1872-1952)

బ్రిటిష్‌ పాలకులతో పోరాడటం ముస్లింల తిరుగులేని విధిగా ప్రకంచటం మాత్రమే కాకుండా స్వరాజ్యం కోసం తానుగా ఉద్యమించి ఉద్యమవారసులను కూడా తయారు చేసుకున్న ప్రముఖ ధార్మికవేత్తలలో ప్రథములు ముఫ్తీ ఖిఫాయతుల్లా.

1872 సంవత్సరంలో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని షాజహన్‌పూర్‌ గ్రామంలో ఖిఫాయతుల్లా జన్మించారు. స్వగ్రామమైన షాజహాన్‌పూర్‌ లోని మదరసాలో ప్రాధమిక విద్యాభ్యాసం తరువాత జాతీయోద్యమకారులకు కేంద్రాంగా నున్న ప్రముఖ విద్యాసంస్థ దేవ్‌బంద్‌లో చేరారు. బ్రిటిషర్ల మీద తిరుగులేని పోరాటం సాగించిన యోదులు, ఆ విద్యాసంస్థ ప్రధానాచార్యులు మౌలానా మహమ్మద్‌ హసన్‌ ప్రభావంతో బ్రిటిష్‌ వలస పాలకులు ఇనుప పిడికిలి నుండి మాతృదేశాన్ని విముక్తి చేయటం కోసం నడుంకట్టారు.

విద్యాభ్యాసం పూర్తిచేసి ఢిల్లీ వచ్చి, ధార్మిక విద్యను బోధించే 'అంజుమన్‌-ఏ- హిదాయతుల్‌-అల్‌-ఇస్లాం' కు చెందిన పాఠశాల నిర్వహణా బాధ్య తలు స్వీకరించారు. ప్రజలలో దిగజారి పోతున్న ధార్మిక, నైతిక విలువలను పెంపొందించేందుకు మౌల్వీ హఫీజ్‌ అబ్దుల్‌ ఘనీతో కలసి 'కితాబ్‌ ఖాన్‌- ఏ-రహిమియ్యా' అను ప్రచురణ సంస్థను స్థాపించారు. జాతీయోద్యమంలో ప్రధాన పాత్రపోషించిన 'జయాయత్‌-ఎ-ఉలేమా-ఏ హింద్‌' అధ్యక్షునిగా 1919 నుండి 1942 వరకు కిపాయతుల్లా బాధ్య తలు నిర్వహించారు.

చిరస్మరణీయులు