పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

పత్రికను నిజాం నిషేధించగా మందుముల నరశింగరావు ఆధ్యర్యంలో నడుస్తున్న రయ్యత్‌ అను ఉర్దూపత్రికలో చేరిన ఆయన తనదైన మార్గంలో పాలకవర్గాల దాష్టీకాలను, రజాకారుల దుర్మార్గాలను తీవ్రంగా ఎండగడ్తూ రచనలు చేశారు. చివరకు రయ్యత్‌ పత్రిక కూడా పాలకవర్గాల ఆగ్రహానికి గురయ్యి మూతపడింది.

ప్రజల పక్షంగా జాతీయ భావాలను పెంపొందించగల దినపత్రిక కోసం భార్య, తల్లి ఆభరణాలను అమ్మి ఇమ్రోజ్‌ (నేడు) అను ఉర్దూ దినపత్రికను 1947 నవంబరు 15న షోయాబుల్లా ఖాన్‌ ఆరంభించారు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టుతున్నా, ఎంతో పట్టుదలతో ఆయన ఇమ్రోజ్‌ను ప్రజల పత్రికగా తీర్చిదిద్దారు. ప్రజల పక్షంవహించిన ఆయన నిరంకుశట్వం, మత దురహంకారం మీద తిరుగులేని సమరం సాగించారు. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది. ఆ సమయంలో నిజాం ఇండియన్‌ యూనియన్‌ లో కలసి పోడానికి తిరస్కరించారు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఆరంభమయ్యాయి. ఆ ఉద్యమాన్ని అణిచి వేసేందుకు నిజాం నవాబు పక్షాన రజాకార్లు సిద్దమయ్యారు. ఆ విపత్కర సమయంలో షోయబుల్లా నిజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేస్తూ సంపాదకీయాలు రాశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా విలీనం అవసరాన్ని వివరిస్తూ నిజాం నిరాకరణ వెనుకగల స్వార్థ రాజకీయాలను బహిర్గతం చేస్తూ వ్యాసాలు ప్రచురించారు. ఈ రాతలు పాలకులకు కంటక ప్రాయమయ్యాయి. నయానా, భయానా నచ్చచెప్పి ఆయన కలాన్ని నియంత్రిం చాలని పాలకవర్గాలు విఫలప్రయత్నాలు చేశాయి. చివరకు బెదిరింపుల పర్వం ఆరంభం కాగా జాగ్రత్తగా ఉండమని పెద్దలిచ్చిన సలహాకు స్పందిస్తూ, సత్యాంవేషణలో ఒక వ్యక్తి మరణిస్తే అది గర్వించదగిన విషయమని గాంధీజీ చెప్పారు కదా అటువంటప్పుడు నేనెందుకు భయపడాలి అని బెదిరింపులను ఖాతరు చేయకుండా ముందుకు సాగారు.

1948 సంవత్సరం ఆగస్టు 21 ఆరరాత్రి సమయంలో ఆయన, ఆయన అనుచరు లు ముహ్మద్‌ ఇస్మాయిల్‌ ఖాన్‌ 'ఇమ్రోజ్‌' కార్యాలయం నుండి ఇంటికి వస్తుండగా పొంచి ఉండి కిరాతక శత్రువు జరిపిన దాడి, కాల్పులలో ఆయన నేల కూలారు. ప్రభువులను కూడ భయకంపితుల్నిచేసిన సంపాదకీయాలు రాసిన ఆయన చేతులను దుండగులు నరికివేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, మరణం అనివార్యం. చావు నుండి ఎవ్వరూ తఫ్ఫించుకోలేరు. ఆమరణం ఒకలక్ష్యం కోసం సంభవిస్తే గర్విమ్చాలి. నేను దేశం కోసం మరణసున్నందుకు మీరు సంతోషించాలి అని బంధుమిత్రులను సముదాయించిన కలం యోధులు షోయాబుల్లా ఖాన్‌ 1948 ఆగస్టు22 తెల్లవారుజామున కన్నిమూశారు.

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌