పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

129

56. బేగం అమీనా తయ్యాబ్జీ

( 1866-1942)

బ్రిటిష్‌ వ్యతిరేక పోరాటాలలో భాగంగా సాగిన సంస్కరణోద్యమాలలో ఆనాడుమహిళలు చురుగ్గా పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలలో ఎంతో నిబద్ధతతోపాటుగా చక్కనికార్యదక్షతను ప్రదర్శించారు. ఆ కారణంగా సమర్దత గల అటువంటి మహిళలను మహాత్మా గాంధీ స్వయంగా ఉద్యమంలోనికి ఆహ్వానించి వారికి ఉద్యమాల నాయకత్వం బాధ్య తలను అప్పగించారు. అంతటి గౌరవాన్ని దక్కించుకున్న మహిళలలో అగ్రగణ్యులు బేగం అమీనా తయ్యాబ్జీ.

అమీనా తయ్యాబ్జీ గుజరాత్‌కు చెందిన ప్రసిద్ధ తయ్యాబ్జీల కుటుంబంలో 1866లో జన్మించారు. భారత జాతీయ కాంగ్రెస్‌ నాయకులు జస్టిస్‌ బద్రుద్దీన్‌ తయ్యాబ్జీ ఆమె తండ్రి కాగా మరో జాతీయోద్యామకారులు జస్టిస్‌ అబ్బాస్‌ తయ్యాబ్జీని ఆమెను వివాహం చేసుకున్నారు. తయ్యాబ్జీల కుటుంబంలో ఉన్నరాజకీయ వాతావరణం మూలంగా బేగం అమీనా జాతీయోద్యమం పట్ల చిన్ననాటనే ఆకర్షితురాలయ్యారు. తొలుత నుండి భారత కాంగ్రెస్‌ సబ్యురాలైన ఆమె స్థానికంగా భారత జాతీయ కాంగ్రెస్‌ కార్యక్రమాలలో చురుగ్గా పొల్గొంటూ వచ్చారు.

ఆ సందర్భంగా అమీనాలో గల పట్టుదల గుజరాత్‌ మహిళలలో ఆమె పట్ల ఉన్న

చిరస్మరణీయులు