పుట:చిరస్మరణీయులు, మొదటి భాగం.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

115

49.టి. ఆహమ్మద్‌ ఖాన్‌ షేర్వాణి

( 1885-1935)

స్వరాజ్య సాధన కోసం ఒకవైపు ఉద్యమిస్తూనే మరోవైపు న సమాజాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక రుగ్మతల మీద సంస్కరణల దండయాత్ర సాగించిన యోధులలో ట్. ఆహమ్మద్‌ ఖాన్‌ షేర్వాణి ప్రముఖులు.

1885లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని అలీఘర్‌ సమీపాన గల బిలోనా గ్రామంలో ఆయన జన్మించారు. జమీందారి కుటుంబానికి చెందిన ఆయన ఉన్నత విద్యాభ్యాసం నిమిత్తం అలీఘర్‌లోని M.A.O. COLLEGE లో ప్రవేశించి కళాశాల విద్యార్థి సంఘం నాయకుడయ్యారు. అ క్రమంలో స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం సాగుతున్న పోరాటం పట్ల ఆకర్షితులైన అహమ్మద్‌ ఖాన్‌, కళాశాల కమిటీ అనుసరిస్తున్న ఆంగ్ల ప్రభుత్వ అనుకూల విధానాలను బహిరంగంగా విమర్శించి కళాశాల నుండి బహిష్కరించబడ్డారు.

1911లో బారిస్టర్‌ పట్టా పుచ్చుకున్నఆయన 1912లో భారతదేశానికి వచ్చారు. ఆలీఘర్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ ప్రారంభించి సామాజిక సేవా కార్యకలాపాలను సాగిస్తూ 1916లో జాతీయ కాంగ్రెస్‌ సబ్యత్వం స్వీకరించారు. ఆ తరువాత శ్రీ మోతిలాల్‌ నెహ్రూ˙, శ్రీ సి.ఆర్‌. దాస్‌, మహత్మా గాంధీ, డాక్టర్‌ యం. ఎ. అన్సారి తదితర నేతల ప్రభావంతో జాతీయ రాజకీయాలలో అడుగుపెట్టారు. 1916లో అనీబిసెంట్ నాయకత్వంలో

చిరస్మరణీయులు