పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సోమనాథునిగూర్చిన కొన్ని ప్రాస్తావికస్తుతులు


శ్లో.

ఆదౌ భృంగిరిటిః, పురాకృతయుగే నామ్నానుకేశీప్రభుః।
త్రేతాయాం వరవీరశైవశరణ శ్రేష్ఠోమునిః పాణినిః।
ద్వాపారే శివమంత్రసిద్ధికలిత స్సానందనామాంకితః।
ఏవం భక్తహితార్థతః కలియుగే పాల్కుర్కి సోమేశ్వరః॥

(అనుశ్రుతము)

ఉ.

శ్రీభసితత్రిపుండ్రకపరీతవిశంకటఫాలు, జాటజూ
టీభరధారు, నిర్మలపటీపటలావృతదేహు, నక్షమా
లాభరణాభిరాము, బసవాక్షరపాఠపవిత్రవక్త్రుఁ, జి
చ్ఛోభితచిత్తుఁ బాల్కురికి సోమయదేశికుఁ బ్రస్తుతించెదన్.

(పిదుపర్తి సోమనాథుఁడు)

మ.

వరసర్వజ్ఞశిఖామణిన్, బ్రథితసద్వారప్రమోదాకరున్
నిరతోద్యచ్ఛివధర్మసంచరుఁ, గళానీకాంచితావాసు, భా
స్వరలింగాన్వితదేహు, సర్వవిబుధవ్రాతామృతాధారు, భా
సురపాదుంగళితారిఁ బాల్కురికివంశ్యుం గొల్తు సోమాహ్వయున్.

(అత్తలూరి పాపయామాత్యుఁడు)

ఉ.

తేనియసోనలం జిలుకు తేటగు జానుతెనుంగుఁబల్కులన్
వీనులఁ దన్పుకబ్బముల నిక్కపు దేసితెనుంగుఁగైతకున్
బ్రాణము వోసిసట్టి బుధవంద్యుని, శ్రీబసవేశచింతనా
సూనృతచిత్తుఁ బాల్కురికి సోమకవీంద్రుని సంస్మరించెదన్.

(బండారు తమ్మయ్య)