పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్వేదసారము

113


ద్రవ్యశ్రవణసంస్మరణదర్శనస్పర్శ
            నాదిరుచ్యంతరూపార్పణంబు
పిండితముద్గలపృథుకబళాభ్యంత
            రాన్వితభక్ష్యభోజ్యార్పణంబు
శాకరసద్రవ్యషడ్రససూపోద
            నాన్యోన్యపరిమిశ్రితార్పణంబు
తత్పదార్థాన్వితతత్ఫలావృతలలి
            తాభినియుక్తిసమర్పణంబు


భక్ష్యభోజ్యలేహ్యపానీయచోష్యము
ఖానుభవకలాసమర్పణంబు
కొలికి యెఱుఁగకున్నఁ గూడునె లింగాను
భవగుణాఢ్యుఁ డగునె బసవలింగ !

224


మశకభృంగపతంగమక్షికస్పర్శ మా
              ర్జాలమూషికముఖాసక్తదృష్టి
వీరవ్రతాచారవిరహితవ్రాత్యాది
              ధర్మాన్వితాద్వైకకర్మదృష్టి
పంక్తిభోజనయుక్తపరిజనస్వకుటుంబి
             భార్యాప్రసాదాన్నపానదృష్టి
వాక్క్రియామానసవ్యాప్తవిజ్ఞాపనా
             సావధానేతరసత్వదృష్టి


చేత నుపహతంబు చెందని మఱి యన్య
మిశ్రితంబు గాని మీఁదు పూని
శుభతరప్రసాదసువిధాని గాక గో
ప్యప్రసాది యగునె బసవలింగ!

225