పుట:చతుర్వేదసారము (పాల్కుఱికి సోమనాథుడు).pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓం

శ్రీమ దుమామహేశ్వరాభ్యాం నమః

చతుర్వేదసారము

సీసపద్యములు




గురవే నమస్తే గురవే నమ
        స్తే గురుమూర్తి ప్రథితగుణాయ!
శ్రీ శంభవే నమస్తే శంభవే నమ
        స్తే శంభు సంచారచేతనాయ!
శ్రీ ప్రమథాయ తే శ్రీ ప్రమథాయ తే
        ప్రమథావతార తారస్మరాయ!
శ్రీ వృషభాయ తే శ్రీ వృషభాయ తే
        వృషభాంశ వీరమాహేశ్వరాయ!


యని నుతించి భవ దపాంగనిర్యద్ఘృణా
మృతరసాబ్ధిఁ దేల మతిఁ దలంచి
నిర్వికల్పరతిఁ జతుర్వేదసార మన్
పద్యము ల్రచింతు బసవలింగ!

1