పుట:కాశీమజిలీకథలు -04.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దుతున్నప్పుడు సమస్య ఎదురైంది

306

కాశీమజిలీ కథలు - నాలుగవ భాగము

దానిని దండ్రియొద్దకుఁ దీసికొని పోయెదనని చెప్పి యడవిలో నేనూఁతిలోనో పారవేసిరండు. పిమ్మట మనల నడుగు వారుండరని భోధించినవిని యతండు మది యొడంబడకున్నను భార్యవలన భయంబున మారాడలేక సమ్మతించి యూరకొనియెను.

మ. కులనిర్మూలనకారణంబు ప్రతిభా • కుట్టాక ముద్వేగకో
     పలతాదోహద మాజవంజవసుఖ • ప్రత్యూహ మాత్మవ్యధా
     జ్విలనజాలిక కామినీనయన వీ • క్షాపాతసంరోధి ని
     త్యలఘుత్వాశ్రయభూమిలేమి యదియా • హా ! యేమిగావింపదో.

అని మున్నొక కవి వాసియున్నాడ గదా ! ఆధూర్త కళావతిని గొన్ని దినములు తనయింటఁ బెట్టుకొని యొరులకు తెలియకుండ నన్న పానాదు లొసంగి లాలించుచుఁ గాపాడినది. మఱియొక నాఁడాబాలిక యావిపృనితో తాతా ! మనమిక్కడకువచ్చి పెక్కు దినములైనది. మా యూరి కెప్పుడు తీసికొనిపోయెదవు? ఉపేక్ష చేయుచున్నావేమి ? నన్ను౦గానక మావారు విచారించుచుందురు గదాయని యడిగిన నాపాఱుండు భార్య నడిగినగాని యేమియుఁజేయడు కావున నామాట నారాగతోఁ జెప్పెను.

ఆ వంచకురాలు మఱునాఁడు వారికిఁ బయనము సవరించి చేయదగిన కృత్యములు మగనికి బోధించి యంపినది. ఆ సదాచారి యా నారీమణిని భుజముపై నెక్కించుకొని యొకయడివి దారింబడి నడుచుచు నొకచో నొక యగాధహ్రదంబు గాంచి యందా సుందరిం బడవేయఁబోయి యంతలో నాత్మగతంబున నయ్యో ! నా భార్య దీనింగూపంబున బడవేయమని చెప్పినది కదా. ఈ ముద్దు బాలికను నాచేఁతులతో నెట్లుపారవేయుదును ? పాప మీపావ నీళ్ళుత్రాగి పెద్దతడవుబాధపడి ప్రాణములు విడుచును. ఇది మరణమునకు సులభమగు తెరువుగాదు మఱి యొకవిధము గావించెద నని యాలోచించి యటఁగదలిపైన నడువదొడంగెను ఆ పాఱుండక్కలకలతిం జంపు తలంపుతో నడవి తెరవులనే నడుచుచుండెను. మఱికొన్ని పయనంబులు గడచినంత నొకనాఁడచ్చేడియ తనతొడపై శిరంబిడి నిద్రించుండ నాజన్ని గట్టిట్లాలోచించెను. ఇప్పు డీచిన్నది నిద్రఁబోవుచున్నది. దీనికంఠము పిసిగిన నిమిషములో జావంగలదు. అట్లు చేయుదునా ? అని చేతులు మెడపైమోపి అబ్బా ! ఈబాలిక నాకేమియపకారము చేసినది ? పాపము తననగల మాటయైన నెప్పుడు తల పెట్టలేదే, ఇట్టిదానినెట్లు చంపుదును? --- యిది యడుగకున్నను దీనితండ్రి తొడపులేదని యడుగక విడిచి పెట్టునా ? అప్పుడు నేనింటికిఁబోయిన నాభార్య నన్నుఁ దిట్టకమానదు కావున దీనిం జంపుటయే కర్జము యిప్పుడుగాదు . తలంచి ఎప్పుడు నిగ్రలేపి యా బాలిక మఱియకప్పు పడతి కప్పడు సెనంగా తొందరయేమినచ్చినదని నెత్తుకొని తెరువు నువవొచంగెను. చండ నగందయ్యో | నా భార్య చెప్పిన -