పుట:కాశీమజిలీకథలు -01.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

308

కాశీమజిలీ కథలు - మొదటి భాగము

వాక్యములు జెప్పినది. కాని యతని యహంకార మణఁగినదికాదు. భార్యలనందఱ బరిభవించి యారాజు రాజ్యము మంత్రి కిచ్చివేసి తాను తపోవనంబునఁ కరిగెను.

మంత్రియు లవంగివలన వారుపోయిన వృత్తాంతమంతయు విని సంతసించుచు గొడుకును గోడండ్రను గూఁతురును నల్లుండును దన్ను భజింప మహావైభవముతోఁ బెద్దకాలము రాజ్యము గావింపుచు ధరిత్రీతలంబున సకలసౌఖ్యము లనుభవించెను.

గోపా! నీవు చూచిన యినుపచిక్కములలో నున్న వారు అంతఃపురద్రోహులు వారే. తైలసిక్తములగుట వారి కళేబరములు చెడక పెద్దకాలమట్లే యున్నవని చెప్పి మణిసిద్ధ యతీంద్రుఁడు శిష్యునితోఁగూడ బోయిపోయి యొకనాఁడు సాయంకాలమునకు జగన్నాథంబు బ్రవేశించెను.

తో ద క వృ త్త ము

    వాగ్వినితాప్రియ వారిజనాభ
    ప్రాగ్వరముఖ్య సుపర్వగణేడ్యా
    దిగ్వసనాంచిత ధీరజనో క్తి
    స్రగ్విభవార్చిత చంద్రకపర్దాత॥

క. మంగళమగుఁ బ్రజలకు నృప
   పుంగవు లేలుదురు ధర్మబుద్ధిదనర ధా
   త్రిం గోవులకును విప్రుల
   కుం గల్గుశుభంబు మనుజకోటి జెలంగన్.

క. కరలోచన కరితారే
   సర్వ సంఖ్యా కలితశాలి శకదీపిత శా
   ర్వరివత్సరమునఁ గాశీ
   పురయాత్రావసధ చరితముం జేసితిగా.

గద్య-ఇది శ్రీమద్విశ్వనాథ సదనుకంపాసంపాదిత కవితావిచిత్రాత్రేయ ముని

సుత్రామగోత్ర పవిత్ర మధి కులకలశ జలనిధి రాకాకుముదమిత్ర లక్ష్మీ

నారాయణ పౌత్ర కొండయార్యపుత్ర సోమిదేవీ గర్భశుక్తి ముక్తాఫల

విబుధజనాభి రక్షిత సుబ్బన్నదీక్షిత కవి విరచితంబగు శ్రీకాశీ

యాత్రావసధర చరిత్రమను మహాప్రబంధంబునందు

ప్రథమ భాగము సమాప్తము.

శ్రీ విశ్వనాథార్పణమస్తు.

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ


శ్రీ బాలాజీ ప్రింటర్స్, విజయవాడ-1.