పుట:కాశీమజిలీకథలు-12.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

కాశీమజిలీకథలు - పండ్రెండవభాగము

వారణాశికి బోగలవాడను. అని వగచుచున్న దివోదాసునకు రత్నచూడుడు మంద హాస సుందరవదనార విందుడగుచు నిట్లనియె.

రాజమార్తాండా ! నీ ప్రభావము నీ వెరుంగక యిట్లు వలవంతఁబొందు చుంటిని భవదీయ విజ్ఞాననేత్రము దెరచిన నీకు దెలియని దెద్దికలదు. శబరబాలకుని కొరకుగాని యనంగమోహిని కొరకుగాని నీవు సామాన్యునివలె నన్వేషించుచు గష్ట పడవలసిన యగత్యము లేకున్నను విధి విధానము ననుసరించి యట్లు జరిగినది. మొదట శబరబాలకుని ప్రేతమును నరిందముండు యక్షలోకమునకు గొంపోయి తైలద్రోణియందు భద్రపరచి యుంచిన యుదంతమును నేను మీ యనుజ్ఞఁబొంది నాడు శీతశైలము నుండి వెడలిపోయిన పిమ్మట నంతర్ధృష్టిం దెలిసికొంటిని‌. కాని తదన్వేషణము నెపమున మీరొనర్ప వలసిన కార్యము లేన్నేనియుండుటంజేసి యింత వరకు మీ కెరిగింపదలంప నైతిని. ఇందులకు నన్ను మన్నింప గోరుచున్నాను మరియు ననంగమోహిని యెందున్నదో కనుంగొనుట కిప్పుడు మీకు‌ కష్టములేదు. నాగలోకమున పితృగృహమున క్షేమముగానున్నదని తెలియుచున్నదిగదా యనుటయు దివోదాసుండు నివ్వైరంబడుచు నార్యా ! శైలకందరాంతరమునుండి యా యన్నుల మిన్న రసాతలమునకు బోవుట చిత్రముగా దోపకుండునా ? ఆ వృత్తాంతము జెప్పి మాకు సంతోషము గూర్చుమని యడుగుటయు రత్నచూడుడు మందహాసముజేయుచు నిట్లనియె.

ధాత్రీశ్వరా ! సర్వము నెరింగియును నీ వావృత్తాంతము నాచే జెప్పింప వలయునని తలంచు చుండుటంజేసి నేనే చెప్పెద నాకర్ణింపుమని యనంగమోహిని వృత్తాంతమెల్ల నంతర్దృష్టిం దెలిసికొని యిట్లు చెప్పందొడంగెను.


పాతాళేశ్వరి కథ

అట్లుహిమశైలకందరాంతరమున మణిగ్రీవునకువెరచి యంధకారబంధురమై యున్నయా మహాబిలములోనికిఁ బారిపోయి యనంగమోహిని మతిసాహసమున నడచు చుండెను. ఆ గుహా ముఖమున కతిసమీపమున మణిగ్రీవుండరిగిన ------------ కిరుప్రక్కలను రెండుగుప్తమార్గములు గలవు. కుడివైపుదారి పాతాళము వరకు వ్యాపించియున్నది. ఎడమవైపు మార్గము శాంభవీదేవి యాలయ ప్రాంగణమునకు జేరియుండెను. అనంగమోహినీ సమాన్వేషణమునకై నీ వగ్గుహాంతరమున బ్రవేశించి వామభాగమందలి మార్గమును దైవవశమున ------------------ జేరికొంటిని. బిలాధ్వమునఁ దిన్నగాబోయిన మణిగ్రీవుని వృత్తాంతము మీరు విన్నదే కదా! ఇక ననంగమోహిని యగ్గుహలో గాఢాంధకారమున నేమియుం గనుంగొనజాలక భయో